Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. పాకిస్థాన్ సీక్రెట్ యూనిట్ వెలుగులోకి.. లక్షల మంది కాలకేయ సైన్యం..!

పాకిస్థాన్ కు చెందిన ఇంటర్- సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) లో S1 యూనిట్ గురించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ యూనిట్ భారత్ కు టెర్రరిస్టులను ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. 1993 లో ముంబై దాడుల దగ్గర్నుంచి ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వరకు ఈ యూనిట్ లోని ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. S1 అనగా సబ్ వెర్షన్ 1 అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరిపే అతి పెద్ద గ్రూప్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు.

ఈ ఎస్ 1 యూనిట్ కు ఆర్మీ కు చెందిన కొలోనెల్ ఆఫీసర్ హెడ్ గా ఉంటాడు. గాజి 1, గాజి 2 అనే మరో ఇద్దరు ఆర్మీ అధికారులు వీరి పర్యవేక్షణ.. ఇతర బాగోగులు చూస్తుంటారు. ఎస్ 1 యూనిట్ ప్రధాన కార్యాలయం ఇస్లామాబాద్ లో ఉంది. వీరికి టెర్రరిస్టు కార్యకలాపాల కోసం డ్రగ్ మనీని ఫండింగ్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఎస్ 1 లోని సిబ్బంది, ట్రైనర్లు.. అన్ని రకాల బాంబ్స్ ను తయారు చేయడంతోపాటు ఇతర పేలుడు పదార్థాలను తయారు చేస్తారు. అలాగే అధిక మొత్తంలో చిన్నచిన్న ఆయుధాలు కూడా తయారు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఎస్ 1 యూనిట్ కు భారత్ లోని దాదాపు అన్ని ప్రముఖ ప్రాంతాలపై పట్టు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్ 1 యూనిట్ గత పాతికేళ్లుగా పనిచేస్తుంది. కేవలం భారత్ లో ఉగ్రకలపాలను నిర్వహించేందుకే ఈ యూనిట్ ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని ఇతర టెర్రరిస్ట్ గ్రూపులతో ఎస్ 1 యూనిట్ కు లింకులు ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఉన్న ఉగ్రవాద శిక్షణ కేంద్రాలైన జైషె- ఈ- మహ్మద్, లష్కర్- ఏ- తోయిబా, హిజ్ బుల్ ముజాయిద్దీన్ లాంటి సంస్థల్లో ఎస్ 1 యూనిట్ సభ్యులు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

వాళ్లు పొడవాటి గడ్డంతో.. స్థానిక ప్రజల వేశధారణతో ఉంటారని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. అయితే ఈ ఎస్ 1 గ్రూప్ ను సీక్రెట్ గా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ట్రెర్రర్ శిక్షణ కేంద్రాల్లో ట్రైనర్లు చాలా మంది ఈ ఎస్ 1 గ్రూప్ నుంచి వచ్చినట్లుగా అక్కడ శిక్షణ పొందుతున్నవారికే తెలియదని సమాచారం. ఎస్ 1 యూనిట్ రెండు దశాబ్దాలుగా వేల మంది టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాల పరిశోధనలో తేలింది.

Pakistan s S1 Exposed ISI s Secret Terror Factory Training Killers for India

ఇక ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది భారత టూరిస్టులు మృతి చెందారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దాడుల వెనకున్నట్లు తేలడంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద సంస్థలపై దాడులు జరిపింది. వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్రం తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+