విమానంలో అగ్ని ప్రమాదం.. కిందకు దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్
విమానంలో అగ్ని ప్రమాదం సంభవించి ప్రయాణికులు కిందకు దూకిన ఘటన స్పెయిన్ లో జరిగింది. స్పెయిన్ లోని పాల్మ డీ మల్లోర్కా ఎయిర్ పోర్టులో ఆగి ఉన్న బోయింగ్ 737 విమానం మరికొద్ది సేపట్లో టేకాఫ్ అవుతోంది అనగా విమానంలో ఫైర్ అలెర్ట్ మోగింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే ఆగి ఉన్న విమానం నుంచి కిందకు దూకేశారు.
స్పెయిన్ లోని పాల్మ డీ మల్లోర్కా ఎయిర్ పోర్టులో బోయింగ్ 737 విమానం మరికొద్ది సేపట్లో టేకాఫ్ అవుతోంది అనగా అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఫైర్ అలెర్ట్ మోగింది. దీంతో ప్రయాణికులు భయంతో ఆగి ఉన్న విమానం నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో 18 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ టీమ్ అక్కడికి చేరుకుని గాయపడ్డవారికి వైద్య సహాయం చేశారు. ఈ మేరకు ఘటనాస్థలికి 4 అంబులెన్సులు, రెండు బేసిక్ లైఫ్ సపోర్ట్ యూనిట్స్ వచ్చాయి.

ప్రయాణికులు విమానం రెక్కల వద్ద నుంచి కిందకు దూకుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గతవారం కూడా అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఫైర్ అలెర్ట్ రావడంతో లాస్ వేగాస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇక ఇటీవల దేశంలో అనేక విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్నింటిలో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో విమాన ప్రయాణం అంటేనే ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.
Passengers leap on WING to flee low-cost plane FIREBALL pic.twitter.com/oI1Dp7nnvG
— RT (@RT_com) July 5, 2025
ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు.. 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరి కొంతమంది వైద్య విద్యార్థులు కూడా మృతి చెందారు.












Click it and Unblock the Notifications