Paul Mackenzie:ఆ అడవిలో తవ్వేకొద్దీ శవాలే.. ఏంటీ క్రైమ్ కథా చిత్రమ్..?

Paul Mackenzie:"ఉపవాసం ఉండు... నేరుగా జీసస్ దగ్గరకు వెళ్తావు" అని ఓ చర్చి పాస్టర్ చెప్పడంతో భక్తులు ఆ మాటలను విశ్వసించి రోజులకు రోజులు ఆహారం తీసుకోకుండా ఉండిపోయారు. చివరకు కన్నుమూశారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు.. ఏకంగా 200కు పైగా భక్తులు మృతి చెందారు. ఈ ఘటన కెన్యా దేశంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇంతకీ ఏం జరిగింది

కెన్యా పోలీసుల కథనం ప్రకారం దక్షిణ కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో శవాలు గుట్టలు గుట్టులుగా బయటపడ్డాయి. అసలు ఇన్ని మృతదేహాలు ఇక్కడికి ఎలా వచ్చాయి.. వీరందరినీ ఎవరైనా హత్య చేసి ఈ దట్టమైన అటవీప్రాంతంలో పడేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తవ్వే కొద్దీ కొన్ని మృతదేహాలు బయటపడుతుంటే మరో 72 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారందరినీ పోలీసులు రక్షించగలిగారు. ఇంకా 600 మంది అదృశ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Paul Mackenzie

ఇక విచారణ ప్రారంభించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ చర్చ్ ఆఫ్ ది గుడ్ న్యూస్ అనే చర్చి నిర్వహిస్తున్న మెకాన్జీ అనే పాస్టర్ మాటలు విన్న భక్తులు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. మరణించేవరకు ఉపవాసంతో ఉంటే నేరుగా జీసస్ దగ్గరకు చేరుకుంటారని ఆయన బోధించాడు. ఆయన బోధనలు విన్న వారు ఆయన మాట ప్రకారమే ఉపవాసం ఉండి చనిపోయారు.

Paul Mackenzie

మృతదేహాలను అడవిలో పూడ్చివేశారు. ఒక్కసారిగా ఈ వార్త దావనంలా వ్యాపించడంతో కెన్యా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.కెన్యా అధ్యక్షుడు విలియమ్ రూటో ఘటనపై స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున వైద్యులు 112 మృతదేహాలను పరీక్షించారు. అయితే చాలామంది ఉపవాసం ఉండి మరణించారని చెప్పిన వైద్యులు పిల్లలతో సహా మరికొందరి గొంతు నులపడం ద్వారా చనిపోయారని చెప్పారు.

ఇప్పటి వరకు ఘటనతో సంబంధం ఉన్నవారిని 25 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వీరిలో ప్రధాన నిందితుడు పాస్టర్ మెకన్జీ కూడా ఉన్నట్లు వెల్లడించారు. పాస్టర్ మెకన్జీ రెచ్చగొట్టే ప్రసంగాలు బోధనలు చేస్తుంటారని అధికారులు చెప్పారు. చదువు అనేది సైతానుతో సమానమని ఒక ప్రసంగంలో చెప్పుకొచ్చినట్లు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో అరెస్టు అయిన పాస్టర్ మెకన్జీకి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+