వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్ పరిస్థితి విషమం - కోలుకోలేని పరిస్థితుల్లో : కార్గిల్ యుద్దానికి కారకుడిగా..!!

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌(78) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముషారఫ్‌ గత 3 వారాలుగా దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు. ముషారఫ్‌కు వెంటిలేటర్‌ తొలగించారని, ఆయన పరిస్థితి కోలుకోవడం సాధ్యం కానంత క్లిష్ట స్థితిలో ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అవయవాలు పని చేయడం లేదని వివరించారు. పాక్‌ సైనిక దళాల ప్రధానాధికారిగా పని చేసిన ముషారఫ్‌ 1999లో అప్పటి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు.

రెండేళ్ల అనంతరం పాక్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ముషారఫ్‌ 2001 నుంచి 2008 వరకు పాక్‌ అధ్యక్షుడిగా పని చేశారు. అభిశంసనను తప్పించుకునేందుకు పదవికి రాజీనామా చేశారు. ముషారఫ్ దేశ విభజనకు ముందు ఢిల్లీలో జన్మించారు. కార్గిల్ యుద్దానికి ఆయనే ప్రధాన కారకుడు. అత్యంత విషమంగా ముషారప్ పరిస్థితి ఉండటంతో ఆయన కోసం ప్రార్థించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం కన్నుమూశారని పాకిస్థాన్ మీడియా తెలిపింది.

Pervez Musharraf critical, recovery not possible, Organs malfunctioning

అయితే ఈ వార్తను కొన్ని మీడియా సంస్థలు తోసిపుచ్చాయి. కుటుంబ సభ్యులు దీని పైన క్లారిటీ ఇస్తూ..పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మూడు వారాలుగా ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నా...క్రమేణా ఆయన పరిస్థితి దిగజారింది. అవయవాలు ఒక దారి తరువాత మరొకటి పని చేయటం లేదు.

English summary
Former Pakistan President Pervez Musharraf's family today said that the military ruler's condition is critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X