పెషావర్ కిరాతకం: భారత్‌పై లష్కరే చీఫ్ హఫీజ్ విషం, హెచ్చరిక
లాహోర్: పెషావర్ పాఠశాల ఘటన పైన పాకిస్తాన్‌కు చెందిన కొందరు నేతలు, ఉగ్రవాదులు భారత్ పైన విషం కక్కుతున్నారు. పెషావర్ ఘటన నేపథ్యంలో యావత్ భారత దేశం చలించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి సామాన్యుడి వరకు అంతా సానుభూతి వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
అయితే పాకిస్తాన్‌కు చెందిన వారు మాత్రం భారత్‌పై అక్కసు కక్కుతూనే ఉన్నారు. లష్కరేతోయిబా అధినేత హఫీజ్ సయీద్ భారత్‌పై విషం కక్కారు. పెషావర్ దాడి వెనుక భారత్ హస్తం ఉందని అతడు ఆరోపించారు. ప్రతికార దాడులు తీర్చుకుంటామని ముంబాయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ బహిరంగంగానే హెచ్చరించారు.

అమెరికాకు సాయంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్‌కు బలగాలను పంపితే కాశ్మీర్ విముక్తికి ముజాహిద్దీన్‌లను పంపుతామని ఆయన అన్నాడు. 2008లో ముంబైపై జరిగిన ఉగ్ర దాడికి వ్యూహం పన్నిన హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. ముషారఫ్ కూడా భారత్ పైన మండిపడ్డ విషయం తెలిసిందే.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పెషావర్‌లో జరిగిన దాడికి భారత్ కారణమని ఆయన ఆరోపించారు. 133 మంది చిన్నారులు, 9 మంది స్కూల్ సిబ్బందిని బలిగొన్న తాలిబన్లకు భారత్ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా శిక్షణ ఇచ్చిందటూ ఆరోపించాడు.

తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ కమాండర్ మౌలానా ఫజుల్లా అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండేవాడు. ఫజుల్లాకు గత ఖర్జయ్ ప్రభుత్వం భారత్ నిఘా సంస్థ రా పాక్‌లో దాడులు చేసేందుకు సహకారం అందించినట్లు తన వద్ద విశ్వాసనీయ సమాచారం ఉందని సీఎన్‌ఎన్ ఐబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషార్రఫ్ ఆరోపించాడు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications