తుపాను బీభత్సం.. 90 మంది మృతి, మరో 75 మంది గల్లంతు..
కాల్మేగీ తుపాను ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. బుధవారం నాటికి మృతుల సంఖ్య 90 కు చేరుకుంది. ఫిలిప్పీన్స్ లోని సెబూ ప్రావిన్స్ లో తుపాను ధాటికి వరదలు సంభవించాయి. రాష్ట్రం మొత్తం జలమయం అయింది. ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 35 మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు సెబూ ప్రావిన్స్ అధికార ప్రతినిధి రోన్ రామోస్ తెలిపారు.
ఫిలిప్పీన్స్ లో తరచుగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. మొన్నటివరకూ భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన ఈ దేశానికి ఇప్పుడు తుపాను రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ఫిలిప్పీన్స్ లో కాల్మేగీ తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ క్రమంలో సెబూ ప్రావిన్స్ పై తుపాను పంజా విసురుతోంది. వరదలతో సెబూ ప్రావిన్స్ అతలాకుతలం అవుతోంది.
ఇప్పటికే తుపాను కారణంగా సంభవించిన వరదల ధాటికి 90 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 75 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. పలు కార్యాలయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దేశంలో భారీగానే ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక సెబూ ప్రావిన్స్ లో వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది.

ఇక సెప్టెంబర్ లో ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం కారణంగా 147 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, భవనాలు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి.












Click it and Unblock the Notifications