వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరోజు ప్రధాని: సినిమా కాదు నిజంగా - ఫిన్‌లాండ్ పీఎంగా 16ఏళ్ల బాలిక - సనా మారిన్‌ సంచలనం

|
Google Oneindia TeluguNews

శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒకే ఒక్కడు' సినిమా చూసిన వాళ్లకు 'ఒక్క రోజు సీఎం' కాన్సెప్ట్ పరిచితమే. ఆ మధ్య పలు స్వచ్ఛద సంస్థలు 'మేక్ ఏ విష్' పేరుతో చిన్నపిల్లల 'పదవీ'కోరికల్ని తీర్చడం, ఇటీవల ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్.. ''కరోనా కట్టడిలో తనకంటే బాగా పనిచేసే వ్యక్తులకు ఒక రోజు కలెక్టర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తా''అని చెప్పడం తెలిసిందే. అయితే, సినిమా స్థాయిలో, నిజంగానే ఒక్కరోజు పూర్తిస్థాయిలో పరిపాలనా బాధ్యతలు చేపట్టిన అరుదైన సంఘటన మాత్రం బుధవారం ఫిన్‌లాండ్ లో చోటుచేసుకుంది.

నరేంద్ర మోదీ అరుదైన రికార్డు - పాలకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం - తొలిసారి హైడ్రామా - ఆపై జనామోదంతో నరేంద్ర మోదీ అరుదైన రికార్డు - పాలకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం - తొలిసారి హైడ్రామా - ఆపై జనామోదంతో

ప్రధానిగా 16 ఏళ్ల అమ్మాయి..

ప్రధానిగా 16 ఏళ్ల అమ్మాయి..

మానవ హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వ సాధన, మహిళా సాధికారత తదితర అంశాల్లో స్కాండినేవియన్ దేశాలు ఎప్పుడూ ముందంజలోనే ఉన్నాయి. వాటిలో ఒకటైన ఫిన్‌లాండ్ లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 34 ఏళ్ల సనా మారిన్.. ప్రపంచంలో ప్రధాని పదవి చేపట్టనున్న అతి చిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కారు. పదవి చేపట్టి ఏడాది కూడా తిరక్కముందే.. సనా సంచలన రీతిలో తన పీఎం పోస్టులో ఓ 16 ఏళ్ల బాలికను కూర్చోబెట్టారు..

విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్

ఆమె పేరు అవా ముర్టో.

ఆమె పేరు అవా ముర్టో.


అవా ముర్టో.. ఇప్పుడీ పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. దక్షిణ ఫిన్‌లాండ్ లోని ‘వాస్కీ'అనే గ్రామానికి చెందిన ఈ 16 ఏళ్ల అమ్మాయి బుధవారం నాడు ఫిన్‌లాండ్ దేశానికి ఒక్కరోజు ప్రధానిగా వ్యవహరించారు. అచ్చం ‘ఒకే ఒక్కడు'లో చూపించినట్లు రాజ్యాంగ బద్ధంగా ఆమె ప్రధానిగా పనిచేశారు. టీనేజరైన అవా చేతికి బాధ్యతలు అప్పజెప్పి, సనా మారిన్ 24 గంటలపాటు హాయిగా రెస్ట్ తీసుకున్నారు. ఒక్కరోజు పీఎం అవా ఫిన్‌లాండ్ పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాలను తెలిపారిలా..

పాలనలో సంక్లిష్టత..

పాలనలో సంక్లిష్టత..

‘‘ప్రధాని హోదాలో ఇవాళ రోజంతా ఉత్కంఠగా గడిచింది. పరిపాలనకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన విషయాలు తెలుసుకున్నాను. ఛాన్సలర్ తో, మంత్రులు, ఉన్నతాధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించాను. అభివృద్ది, విదేశీ వాణిజ్యంపై పలు సూచనలు చేశాను. నిజానికి మన నేతలు మరింత ఇన్నోవేటివ్ గా, సరికొత్తగా ఆలోచించేలా టీనేజర్ల సలహాలు, సూచనలు పనికొస్తాయని నా అభిప్రాయం. ఒక్క రోజు ప్రధానిగా బాగానే పని చేశాననుకుంటా, భవిష్యత్తులో పూర్తికాలం ప్రధానిగానూ అవుతానేమో'' అని నవ్వుతూ చెప్పింది అవా ముర్టో.

గర్ల్స్ టేకోవర్ క్యాంపెయిన్

గర్ల్స్ టేకోవర్ క్యాంపెయిన్

‘ప్లాన్ ఇంటర్నేషనల్' అనే స్వచ్ఛంద సంస్థ పలు రంగాల్లో బాలికలను ప్రోత్సహించే దిశగా ‘గర్ల్స్ టేకోవర్' పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. బాలికల డిజిటల్ నైపుణ్యాలు, టెక్ పరిశ్రమలో అవకాశాల పెంపు, అలాగే మహిళలపై ఆన్‌లైన్ వేధింపుల సమస్యను హైలైట్ చేయడం లాంటివి ఈ క్యాంపెయిన్ ద్వారా చేపట్టారు. అందులో భాగంగానే 16 ఏళ్ల అవాకు ప్రధానిగా పని చేసే అరుదైన అవకాశాన్ని ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు, మరికొన్ని దేశాలు సైతం గర్ల్స్ టేకోవర్ క్యాంపెయిన్ లో పాలుపంచుకుంటున్నాయి.

English summary
Finnish Prime Minister Sanna Marin faced a quieter day than usual on Wednesday after handing power to a 16-year-old as part of a campaign to promote girls' rights. Aava Murto, from Vaasky in southern Finland, said she was having an "exciting day" as she faced media on the steps of parliament after meeting with the chancellor of justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X