'మోదీ ఫోన్ చేశారు..': భారత్-పాక్ వివాదంపై ట్రంప్ సంచలనం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది మే నెలలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తాను పరిష్కరించానని.. అణు యుద్ధం జరగకుండా ఆపానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి "మేము ఇక యుద్ధానికి వెళ్లడం లేదు" అని చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వివాదంలో ఏ మూడో పక్షం జోక్యాన్ని కూడా తాము అంగీకరించబోమని భారత్ మొదటి నుంచీ స్పష్టం చేస్తూ వస్తోంది.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరైన యూఎస్-సౌదీ పెట్టుబడి ఫోరంలో బుధవారం మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. భారత్, పాకిస్తాన్ అణు ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమవుతున్నాయని.. తాను వాటిని ఆపానని ట్రంప్ వెల్లడించారు."మీరు కావాలంటే యుద్ధానికి వెళ్లండి. కానీ నేను మాత్రం మీ రెండు దేశాలపై 350 శాతం టారిఫ్ విధిస్తాను. అమెరికాతో ఇకపై మీకు వాణిజ్యం ఉండదు." అని తాను ఆ రెండు దేశాలకూ చెప్పాలని ట్రంప్ పేర్కొన్నారు.

PM Modi Called Me Donald Trump Sensational Claim on Stopping India Pakistan Conflict

కోట్ల మంది ప్రజలను చంపుతూ.. ఆ అణు ధూళిని లాస్ ఏంజెల్స్ (అమెరికా నగరం) మీదుగా తేలేలా నేను చూడబోనని తాను స్పష్టం చేసినట్లు ట్రంప్ వివరించారు. సుంకాలు విధించవద్దని రెండూ దేశాలు కోరినా.. తాను వెనక్కి తగ్గకుండా యుద్ధం ఆపితే మంచి వాణిజ్యం ఒప్పందం చేసుకుందామని చెప్పినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను సుంకాలను ఉపయోగించి అనేక వివాదాలను పరిష్కరించానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

మోదీ, షెహబాజ్ షరీఫ్‌ల నుంచి ఫోన్ కాల్స్ వాదన
ట్రంప్ తన వాదనను బలోపేతం చేయడానికి రెండు దేశాల ప్రధానుల నుంచి తనకు కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు కాల్ చేసి, లక్షల మంది ప్రాణాలను కాపాడినందుకు వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ సమక్షంలో కృతజ్ఞతలు చెప్పారని ట్రంప్ తెలిపారు."ఆ తర్వాత ప్రధాన మంత్రి మోదీ నుంచి నాకు కాల్ వచ్చింది. 'మేము ఆపేశాము' అని మోదీ అన్నారు. నేను 'ఏం ఆపేశారు?' అని అడిగాను. దానికి మోదీ 'మేము యుద్ధానికి వెళ్లడం లేదు' అని బదులిచ్చారు" అని ట్రంప్ వెల్లడించారు. ఆ తర్వాత తాను ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పి "మంచి ఒప్పందం చేసుకుందాం" అని అన్నట్లు ట్రంప్ వివరించారు.

జోక్యాన్ని ఖండించిన భారత్
ట్రంప్ మే 10న సోషల్ మీడియాలో కాల్పుల విరమణ గురించి ప్రకటించినప్పటి నుంచి.. ఆయన ఈ వాదనను 60 సార్లకు పైగా పునరావృతం చేశారు అయితే ఇండియా ఈ వాదనను పదే పదే ఖండిస్తోంది. ఈ వివాదంలో ఏ మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించబోమని భారత్ మొదటి నుంచీ స్పష్టం చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్'ను (మే 7న ప్రారంభించింది) ప్రారంభించిన తర్వాత, మే 10న ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామని భారత్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+