క్వాడ్‌లో మోదీ మాస్టర్ ప్లాన్: అమెరికాకు చెక్ పెట్టేందుకు జపాన్‌తో వ్యూహం!

ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా పర్యటనలు.. ట్రంప్ ప్రభుత్వం ఏకపక్ష వాణిజ్య విధానాల నేపథ్యంలో ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ట్రంప్ విధించిన సుంకాల వల్ల భారత విదేశాంగ విధానం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో భారత్ తన సమస్యలను ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా అర్థం చేసుకుని, అమెరికాతో వ్యవహరించడంలో సహకరించే అంతర్జాతీయ భాగస్వాముల కోసం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా జపాన్, చైనా కూడా ఇబ్బందులు పడుతున్నందున.. ఈ రెండు దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలుస్తాయని భారత్ భావిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనలు భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రదర్శించడమే కాకుండా.. డొనాల్డ్ ట్రంప్ విధానాలకు ఒక గట్టి సమాధానం కూడా ఇస్తాయి. ఈ పర్యటనల ద్వార భారత్ తన వాణిజ్య సంబంధాలను వైవిధ్యపరచాలని, కేవలం అమెరికాపై ఆధారపడకుండా కొత్త మార్గాలను అన్వేషించాలని చూస్తోంది.

PM Modi s Japan Visit Master Plan to Counter US with Quad Strategy

జపాన్‌తో బంధం: ఆర్థిక భాగస్వామ్యానికి కొత్త అధ్యాయం
ప్రధాని మోదీ పర్యటనలో మొదటి గమ్యం జపాన్. ఇది ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటించడం ఎనిమిదోసారి. ఈ పర్యటనలో ప్రధాన మోదీ జపాన్ ప్రధాన షిగెరు ఇషిబాతో 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. జపాన్ భారత్‌కు ఐదో అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిదారుగా ఉంది. డిసెంబర్ 2024 నాటికి సుమారు 43.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా జపాన్ ఈ స్థానాన్ని పొందింది. అంతే కాకుండా సుజుకి వంటి జపాన్ కంపెనీలు రాబోయే దశాబ్ధంలో 10 ట్రిలియన్ యెన్‌లు(68 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు వేస్తున్నాయి.

జపాన్ టెక్నాలజీ, భారత్ ప్రతిభ కలగలిస్తే ఈ శతాబ్ధంలో సాంకేతిక విప్లవాన్ని ముందుకు నడిపించవచ్చని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జపాన్ భారత్‌కు ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. మెట్రో రైలు, బుల్లెట్ రైలు వంటి సాంకేతికతను అందించిన జపాన్, అమెరికా మాదిరిగా ఎప్పుడూ భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించలేదు. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో భారత్ సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు(AI) వంటి రంగాలలో జపాన్‌తో సహకారాన్ని పెంచుతోంది. ఇది అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా ఉంది. ఈ చర్య, ప్రత్యామ్నాయ ఆర్థిక భాగస్వాములను భారత్ కనుగొనగలదని ట్రంప్‌కు స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది.

క్వాడ్ కూటమిలో అమెరికాకు సందేశం
మోదీ జపాన్ పర్యటనలో మరొక ముఖ్య ఉద్దేశం క్వాడ్ (భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా) కూటమిలో అమెరికా ప్రభావాన్ని సమతుల్యం చేయడం. ఈ కూటమిలో జపాన్, భారత్ సభ్యులు కాబట్టి.. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధానిని ఒప్పించి క్వాడ్ వేదిక ద్వారా కూడా అమెరికాకు ఒక సందేశాన్ని పంపవచ్చు. జపాన్‌పై కూడా అమెరికా సుంకా విధించింది. ఈ కారణంగా జపాన్ డొనాల్డ్ ట్రంప్ అన్యాయమైన వాణిజ్య విధానాలను అర్థం చేసుకోగలదు. జపాన్ ఇప్పటికే తమ సుంకాల సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ అమెరికా మొండి పట్టుదల వల్ల అది సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితిలో జపాన్ భారత్ ఆందోళనలను మరింత తీవ్రంగా పరిగణిస్తుందని భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+