వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోదీ అమెరికా పర్యటన: ప్రధాని కలవబోతున్న ఐదు బడా కంపెనీల సీఈవోలు ఎవరు, ఈ సమావేశాలు ఎందుకంత కీలకం?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు.

భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటలకు ఆయన వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తోపాటూ, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులతో కూడా మోదీ సమావేశం అవుతారు.

https://twitter.com/narendramodi/status/1440822209316995073

వారితో పాటూ ఆయన అమెరికా అగ్ర పారిశ్రామికవేత్తలను కలిసి భారత్‌లో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.

ఇందులో భాగంగా ఆయన గురువారం ఐదుగురు సీఈఓలతో సమావేశం కానున్నారు. వీరిలో ఇద్దరు భారత సంతతి అమెరికన్లు.

ఎడోబ్‌కు చెందిన శాంతను నారాయణ్, జనరల్ అటామిక్స్ వివేక్ లాల్ భారత సంతతివారు. మిగతా ముగ్గురు సీఈఓల్లో క్వాల్‌కామ్‌కు చెందిన క్రిస్టియానో ఆమోన్, ఫస్ట్ సోలార్‌కు చెందిన మార్క్ విడ్‌మార్, బ్లాక్‌స్టోన్‌కు చెందిన స్టీఫెన్ ఎ ష్వార్జ్‌మెన్ ఉన్నారు.

మిలిటరీ గ్రేడ్ డ్రోన్లు తయారు చేయడం వివేక్ లాల్ కంపెనీ జనరల్ అటామిక్స్‌ ప్రత్యేకత. ఆ కంపెనీ అత్యాధునిక డ్రోన్ల తయారీలో టాప్ కంపెనీగా ఉంది.

అమెరికా ఇలాంటి మిలిటరీ టెక్నాలజీని తన ప్రధాన మిత్రదేశాలకు మాత్రమే అందిస్తోంది. భారత్ కూడా తన సాయుధ దళాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అందుకే ఆ సంస్థ సీఈఓతో మోదీ సమావేశం కీలకమైందని భావిస్తున్నారు.

ఇక భారత్‌లో ఎన్నో స్వదేశీ సంస్థలు 5జీ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దానికోసం తగిన టెక్నాలజీని కూడా అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని సురక్షితంగా లాంచ్ చేయడానికి, చిప్ తయారీ రంగంలో అగ్రశ్రేణి కంపెనీ అయిన క్వాల్‌కామ్ సీఈఓ అమోన్‌తో సమావేశాన్ని కూడా కీలకంగా చెబుతున్నారు.

భారత్ సౌర శక్తిని ప్రోత్సహిస్తోంది. దీనికోసం పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ సోలార్ సీఈఓ విడ్‌మార్‌తో సమావేశం చాలా ముఖ్యమైందని చెబుతున్నారు. సోలార్ ఎనర్జీ రంగంలో పనిచేస్తున్న కంపెనీల్లో ఫస్ట్ సోలార్ అగ్రస్థానంలో ఉంటుంది.

ప్రధాని నరేంద్ర మోదీ

ఇక ష్వార్జ్‌మాన్ సీఈఓ, సహ వ్యవస్థాపకులుగా ఉన్న బ్లాక్‌స్టోన్ సంస్థ ప్రపంచంలోని సంపన్నుల డబ్బును పెన్షన్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడుతుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణ కోసం భారతదేశానికి మరిన్ని ఆర్థిక వనరులు అవసరమైన సమయంలో ఆ కంపెనీ సీఈఓతో ప్రధాని సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక ఎడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ ఐటీ, డిజిటల్‌ రంగంలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వం డిజిటల్ ఇండియాపై దృష్టి పెడుతుండడంతో ఆయనతో ప్రధాని సమావేశాన్ని కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.

https://twitter.com/narendramodi/status/1440827900941402115

అమెరికా చేరుకోగానే "వాషింగ్టన్‌లో ఘన స్వాగతం పలికినందుకు భారత సమాజానికి నా ధన్యవాదాలు. ప్రవాసులే మన బలం. ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన, తన కార్యక్రమం గురించి కొన్ని ఫొటోలు ట్వీట్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌తో కూడా మోదీ సమావేశం కానున్నారు.

కరోనా సమయంలో ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటన తర్వాత మోదీ అంతర్జాతీయ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి.

అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ సెప్టెంబర్ 26న తిరిగి దిల్లీ చేరుకుంటారు. అందరి దృష్టి సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరగబోయే సమావేశం మీదే ఉంది.

జనవరిలో జోబైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారత్, అమెరికా మధ్య జరుగుతున్న తొలి ద్వైపాక్షిక సమావేశం ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
PM Modi to meet five top company CEO's, why is the meeting so important
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X