వాటికన్ సిటీలో ప్రధాని మోడీ: పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ: వెంట.. అజిత్ ధోవల్
వాటికన్ సిటీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే వాటికన్ సిటీకి చేరుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఆయన వెంట ఉన్నారు. వాటికన్ సిటీకి చేరుకున్న ప్రధానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని భేటీ మర్యాదపూరకంగా మాత్రమే కలిశారు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఎలాంటి అజెండా లేదని ఇదివరకే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రోమన్ క్యాథలిక్ చర్చికి ప్రధాన కేంద్రంగా భావిస్తారు వాటికన్ సిటీని. రోమ్ నగరం మధ్యన ఉంటుంది. దీన్ని స్వతంత్ర దేశంగా భావిస్తారు. జీ20 అత్యున్నత సమావేశంలోపాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారులు రోమ్‌కు చేరుకున్నారు. ఈ జీ20 సమ్మిట్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సదస్సు కొనసాగుతుంది.

ఇందులో పాల్గొనడానికి ముందే- ప్రధాని మోడీ వాటికన్ సిటీకి చేరుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. రోమ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవ్వాళే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్, ఇండోనేషియా ప్రధాన మంత్రి జోకో విడొడొలను కలుసుకుంటారు. వారిద్దరితో పాటు సింగపూర్ ప్రధానమంత్రి లీ హొసెయిన్‌ను కూడా కలుసుకోవాల్సి ఉంది. ఇది ఇంకా షెడ్యూల్ కాలేదని సమాచారం. ఈ సాయంత్రానికి ప్రధాని టెర్మె డి డయోక్లెజియానో పోడియానికి చేరుకుంటారు.
#WATCH Prime Minister Narendra Modi at the Vatican City to meet Pope Francis
— ANI (@ANI) October 30, 2021
He is accompanied by NSA Ajit Doval and EAM Dr S Jaishankar pic.twitter.com/JZiMbXUtLN
అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీ20 దేశాధినేతలు, ఇతర అధికారులు, ప్రతినిధులతో కలిసి రాత్రి భోజనం చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలైన తరువాత ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, దాన్ని నివారించడానికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు, ఇకపై చేపట్టాల్సిన ప్రణాళికల గురించి ఈ జీ20 సమ్మిట్‌లో ప్రధాని చర్చిస్తారు. సమీకృత అభివృద్ధి, వాతావరణ మార్పుల గురించీ ప్రస్తావిస్తారు.

తన రోమ్ పర్యటనలో ప్రధాని మోడీ ఇదివరకే ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, ఇతర యూరోపియన్ యూనియన్ లీడర్లతో సమావేశం అయ్యారు. కోవిడ్ 19ను నివారించడానికి భారత్ చేపట్టిన చర్యలపై ఆయా యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు ప్రధానిని ప్రశంసించారు. ఇటలీలో స్థిరపడిన ప్రవాస భారతీయులను కూడా ఆయన కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరకు మోడీ రోమ్‌లో ఉంటారు. జీ20 దేశాల సమ్మిట్ ముగిసిన అనంతరం ఆయన స్వదేశానికి తిరిగి వస్తారు.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications