వాజపేయికి ఆప్గన్ పుట్టినరోజు కానుక: మోడీ సంతోషం

కాబూల్: రూ. 710 కోట్ల వ్యయంతో అఫ్ఘనిస్థాన్‌‌లో భారత్ నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఈరోజు ఉదయం అప్గనిస్థాన్ రాజధాని కాబూల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కాబూల్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

స్వాగతం పలికిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని మోడీ ఆత్మయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై నేతలుసమాలోచనలు జరిపారు. అంతకు ముందు అధ్యక్ష భవనంలో అల్పాహార విందులో పాల్గొన్నారు.

అనంతరం ఆప్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారత్ నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ఆఫ్గన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 125 కోట్ల మంది భారతీయ స్నేహితుల ప్రతినిధిగా మీ ముందున్నాను.

PM Narendra Modi inaugurates new Afghan Parliament building in Kabul

అఫ్గాన్ ప్రజలు ఓటుతో తమ భవితవ్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆయుధాలకు చరమాంకం పలికి ప్రజాస్వామ్యానికి తెరలేపారని అన్నారు. నూతన పార్లమెంట్ భవనం రెండు దేశాలు, జాతుల మధ్య వారధిగా ఉంటుందన్నారు. జాతికి చేసిన సేవ, ప్రజాస్వామ్యానికి గుర్తింపుగా ఈ భవనం నిలుస్తుందన్నారు.

ఈ భవనం సాక్షిగా ఇరుదేశాల మధ్య ఆలోచనాత్మక సంబంధాలు బలోపేతమవుతాయని నమ్ముతున్నానని మోడీ చెప్పారు. పార్లమెంట్‌లో ఒక బ్లాక్‌కు భారతరత్న అటల్ బిహారి వాజపేయి పేరు పెట్టడం నాకెంతో ఆనందం కలిగిందని చెప్పుకొచ్చారు. ఆయన పుట్టినరోజునే దీన్ని ప్రారంభించడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు.

పార్లమెంట్ భవనం ప్రారంభంతో హమిద్ కర్జాయ్ కన్న కల సాకారమైందని ప్రధాని మోడీ కొనియాడారు. దీంతో పాటు అఫ్గాన్ అమరవీరులకు పిల్లల కోసం 500 స్కాలర్ షిప్‌లు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు అఫ్గాన్ జట్టుకు ఢిల్లీ సమీపంలో మైదానం ఇచ్చినట్టు ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ నూతన భవనానికి అటల్‌ బ్లాక్‌గా నామకరణం చేశారు. భారత్‌ రూ.710కోట్ల వ్యయంతో అఫ్ఘనిస్థాన్‌ పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించింది. 86 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. మొగల్ సంప్రదాయానికి అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించారు. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోడీ పర్యటను ఆప్గన్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+