Visa Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. 'వీసా' లేకుండానే ఆ దేశానికి!

భారతీయ పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం ఊహించని శుభవార్త అందించింది. ఇకపై భారత పౌరులు ఎలాంటి వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజుల పాటు హాయిగా పర్యటించేందుకు వీలుగా 'వీసా-ఫ్రీ' విధానాన్ని తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ తాష్కెంట్ పర్యటనలో ఉన్న వేళ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఈ చారిత్రక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఇరు దేశాల మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధం మరింత బలోపేతం కానున్నాయి.

రెండు రోజుల ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఇరు దేశాలు తమ దౌత్య సంబంధాలను 'కాంప్రహెన్సివ్ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్' స్థాయికి తీసుకెళ్లేందుకు అంగీకరించాయి. 2030 నాటికి చెరో వైపు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.40 వేల కోట్లు) పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ నెట్‌వర్క్, అంతరిక్ష పరిశోధనలు, న్యూక్లియర్ ఎనర్జీ రంగాల్లో కలసి పనిచేసేందుకు రెండు దేశాలు అడుగులు ముందుకు వేశాయి.

PM Narendra Modi Uzbekistan Visit 30 Day Visa Free Entry Announced to Boost Tourism and Business
నో అసైలమ్- టూరిజం Visa పై అమెరికా ఉక్కుపాదం: కుప్పలు తెప్పలుగా రద్దు
నో అసైలమ్- టూరిజం Visa పై అమెరికా ఉక్కుపాదం: కుప్పలు తెప్పలుగా రద్దు

అణు విద్యుత్‌కు ఊతం.. నిరంతరంగా యురేనియం సరఫరా!

భారత ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు సుదీర్ఘకాలం పాటు యురేనియం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రక్షణ రంగంలోనూ పరస్పరం సహకరించుకోవాలని, ఉగ్రవాదం, తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని ఇరు దేశాల అధినేతలు తీర్మానించారు. అంతేకాకుండా, గుజరాత్‌లోని 'గిఫ్ట్ సిటీ' సాంకేతికతను అధ్యయనం చేయడానికి ఉజ్బెకిస్థాన్ నుంచి ఒక బృందం భారత్‌కు రానుంది.

Visa: సెప్టెంబర్ 3న కోర్టు కీలక తీర్పు! డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ రద్దు?
Visa: సెప్టెంబర్ 3న కోర్టు కీలక తీర్పు! డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ రద్దు?

తాష్కెంట్‌లో యోగా జోరు.. మోదీకి అత్యున్నత పురస్కారం!

ప్రస్తుతం భారత్ - ఉజ్బెకిస్థాన్ మధ్య వారానికి 14 ప్రత్యక్ష విమానాలు నడుస్తున్నాయి. ఉజ్బెకిస్థాన్‌లో యోగాకు విపరీతమైన ఆదరణ పెరుగుతోందని, 2018 నుంచే అక్కడ యోగా ఫెడరేషన్ పనిచేస్తోందని అధ్యక్షుడు మిర్జియోయేవ్ తెలిపారు. ఈ సందర్భంగా తాష్కెంట్‌లో స్థానికులు చేసిన యోగాసనాలను ప్రధాని మోదీ స్వయంగా వీక్షించారు. అనంతరం ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ తమ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ఒలీ దరాజాలి దుస్త్లిక్'ను బహూకరించి గౌరవించింది. తాష్కెంట్ పర్యటన ముగించుకుని మోదీ 26వ ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిజిస్థాన్‌కు పయనం కానున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+