ల్యాండవుతూ కుప్పకూలిన విమానం: 12మంది మృతి
సిడ్నీ: కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా.. సాంకేతికలోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. పాపువా న్యూగినియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్సామిన్ నుంచి కియుంగా ప్రాంతానికి ప్రయాణికులతో బయలుదేరిన సన్‌బ్రిడ్ ఏవియేషన్ విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది.
దీంతో కియుంగా ఎయిర్‌పోర్టుకు సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ సహా విమానంలోని ప్రయాణికులంతా మృతిచెందారు.

విమానంలో ముగ్గురు చిన్నారులు, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి సహా 12 మంది ఉన్నారు. ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 19 మంది మృతి
పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications