రేపే వరలక్ష్మీ వ్రతం, పూజా ముహూర్తం- ఈ సారి ప్రత్యేకత..!!

తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ సందడి కొనసాగుతోంది. వరలక్ష్మీ వ్రతానికి తెలుగు మహిళలు సిద్దం అవుతున్నారు. రేపు (శుక్రవారం) వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు పండితులు సూచనలు చేస్తున్నారు. వివాహితలు అత్యంత భక్తితో చేసుకునే ఈ వరలక్ష్మీ వ్రతం ముహూర్తం.. ఏ సమయంలో పూజ చేసుకోవాలి.. ప్రత్యేకతల గురించి పండితులు కీలక సమాచారం అందిస్తున్నారు.

వరలక్ష్మీ వ్రతం ఆచరించాలనుకునే వారు బ్రహ్మ ముహూర్తం లేదా ఉదయం పూట వ్రతం చేసుకోవడానికి సరైన సమయం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు రెండో శుక్రవారం చాలా విశిష్టమైనది. ఈ ఏడాది ఆగస్టు 21 వతేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.

పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!
పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!
Varalakshmi Vratam 2026 Puja Muhurtam and Significance here the details

ఈ వ్రతాన్ని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, కుంభ లగ్నం , వృషభ లగ్న సమయాలు పూజకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆయా ప్రాంతాలలోని స్థానిక పంచాగం ప్రకారం సరిగ్గా ముహూర్తం చూసుకుని కలశ స్థాపన చేయడం వల్ల అష్టలక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వాసం.

సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం 6:10 - 08:28 వరకు, అదే విధంగా వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 02:58, కుంభ లగ్న పూజ ప్రదోష కాల ముహూర్తం సాయంత్రం 6:20- 7:58 వరలక్ష్మి వ్రతం పూజకు శుభముహూర్త సమయాలుగా చెబుతున్నారు.వరలక్ష్మీ వ్రతం రోజున స్థింహ లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరంగా సూచిస్తున్నారు.

వరలక్ష్మీ వ్రతం స్పెషల్ తీపి అప్పాలు.. ఇలా చేస్తే బాగుంటాయి
వరలక్ష్మీ వ్రతం స్పెషల్ తీపి అప్పాలు.. ఇలా చేస్తే బాగుంటాయి

భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మీ వ్రతం దీపావళి పూజతో సమానమైన ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఇంకా చారుమతి కథను చదవడం, కనకధారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అందరికీ ఉదయం 9:06 నుంచి 10:30 మధ్య సమయంలో పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైన సమయంగా స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+