రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. విద్యార్థి గొంతు నొక్కిన సీఐ: వీడియో వైరల్!

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. శక్తి పథకం, జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసేలా ఇచ్చిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా.. మహబూబాబాద్ పట్టణ సీఐ రఘుపతి రెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.

Telangana Polytechnic Students Protest CI Raghupathi Reddy Grabs Student Neck in Mahabubabad Video Viral

విద్యార్థుల ఆవేదన
డిప్లొమా చేసే విద్యార్థులు మధ్యతరగతి వాళ్ళే ఉంటారని.. ఇప్పుడు దీన్ని శక్తి స్కీంలోకి తెస్తే మేం ఏమైపోవాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచిధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని.. ఒక్కరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారే తప్ప మా భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇలా ఎవరిని అడగకుండా జీవోలు పాస్ చేస్తే మా భవిష్యత్తు ఏం కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉండాలని డిప్లొమా చేశామని.. అలా కాదు, మీరు లేబర్‌లాగా ఉండాలి అంటే ఎలా అంటూ విద్యార్థులు అడుగుతున్నారు. ఇదేంటని రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు మమ్మల్ని కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసుల తీరు గురించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జీవో నెం.97 ద్వారా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటం సరికాదన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పట్టుకుని సీఐ రఘుపతిరెడ్డి దాడి చేశారని ఆరోపిస్తూ.. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు ప్రశ్నలు సంధించారు. తాను కూడా పాలిటెక్నిక్ చేసి ఆ తర్వాత బీఏ చేశానని రేవంత్ రెడ్డి గత విద్యాభ్యాసాన్ని ప్రస్తావిస్తూ.. మరి ఈ విద్యార్థులు పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందించే మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో శక్తి పథకం పేరుతో మార్పులు తీసుకురావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కారుకు విద్యార్థుల భవిష్యత్తుపై శ్రద్ధ లేదని, ఆర్థిక ప్రయోజనాలపైనే దృష్టి ఉందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు ఖర్చు చేస్తున్న నిధులను విద్యార్థుల సంక్షేమం, విద్యా రంగం బలోపేతానికి వినియోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అన్నారు.

కేకే విద్యార్థులను బెదిరించాడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మేధావులకే మేధావి అయిన కేశవరావు బుధవారం పాలిటెక్నిక్ విద్యార్థులను పిలిచి బెదిరించాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఓ తాతగా ఉండాల్సిన కేశవరావు ఈ పిల్లలను భయపెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మా దగ్గర డబ్బులు లేవన్న ముఖ్యమంత్రి.. రూ.111 కోట్లతో కొత్త హెలికాప్టర్ కొన్నాడు కదా.. అదే డబ్బులు వీళ్ల కోసం పెడితే వీళ్లు బాగుపడే వాళ్లు కదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ను తిట్టడం కోసం 6 నెలలుగా మీటింగ్లు పెట్టి ఒక్కో మీటింగ్‌కు రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు కదా.. ఆ డబ్బులు పిల్లలకు ఇస్తే బాగుపడే వారు కదా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+