'ఎన్ ఎస్ జీ లో శాశ్వత సభ్యత్వానికి మద్దతు',' ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు'

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 1.10 నిమిషాలకు ట్రంప్ తో సమావేశమయ్యేందుకు మోడీ వై

వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 1.10 నిమిషాలకు ట్రంప్ తో సమావేశమయ్యేందుకు మోడీ వైట్ హౌజ్ కు చేరుకొన్నారు.

అప్పటికే అక్కడ వేచి ఉన్న ట్రంప్ , మెలానియా దంపతులు మోడీని సాదరంగా ఆహ్వానించారు. సుమారు రెండు నిమిషాల పాటు ప్రధాన ద్వారం వద్దే క్షేమ సమాచారాలను విచారించుకొన్న ముగ్గురూ భవంతిలోకి వెళ్ళారు.

ట్రంప్. మెలానియా, మోడీ వైట్ హౌజ్ ఆవరణ గుండా మాట్లాడుకొంటూ వెళ్తుండగా వారిని చిత్రీకరించేందుకు మీడియా పోటీ పడింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రధానమంత్రి మోడీకి ట్రంప్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పడానికి ఈ కొద్దిక్షణాలు చాలని మీడియా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పోన్లో మోడీతో మాట్లాడినప్పటికీ ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యత నెలకొంది.

ఎస్ఎస్ జీ లో భారత్ కు సభ్యత్వం కోసం మద్దతు

ఎస్ఎస్ జీ లో భారత్ కు సభ్యత్వం కోసం మద్దతు


భారత ప్రధానమంత్రి మోడీకి శ్వేతభవనంలో అతిథ్యమివ్వడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీని గొప్ప ప్రధానమంత్రిగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ మంచి కార్యదక్షతను కనబరుస్తున్నారని చెప్పారు. ఇంకా మరెన్నో విధాలుగా ముందంజ వేస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీని తాను అభిందిస్తున్నానని చెప్పారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్ఎస్ జీలో భారత్ సభ్యత్వానికి మద్దతు ఉంటుందని ట్రంప్ ప్రకటించారు.భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆర్థికపరంగా భారత్ అభివృద్ది చెందుతోందన్నారు.. భారత్ తో ఆర్థికమైత్రి కొనసాగుతోందని ట్రంప్ ప్రకటించారు. అత్యున్నత సంపద్రయాలు ఆచారాలు కలిగిన దేశం గా ఆయన భారత్ ను అభివర్ణించారు.

చారిత్రత్మకరోజు

చారిత్రత్మకరోజు

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలను చేపట్టకముందే 2014 లో ట్రంప్ ఇండియాకు వచ్చిన సమయంలో తన గురించి మంచి అభిప్రాయాలను వ్యక్తం చేశారని భారత ప్రధానమంత్రి మోడీ చెప్పారు. రెండేళ్ళ క్రితం తన గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తాను ఎన్నటికీ మరిచిపోనన్నారు. తన ఈ ప్రస్తుత పర్యటన సందర్భంగా ట్రంప్ ఆయన సతీమణి తనకిచ్చిన స్వాగతం, గౌరవాలకు ఆయన దన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాదన్నారు. 125 కోట్ల భారతీయులకు కూడ అని మోడీ చెప్పారు. అమెరికా, భారత్ ప్రపంచాన్ని నడిస్తున్న శక్తులని మోడీ చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము అమెరికాతో కలిసి పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.ట్రంప్ చూపిన ఆదరాబిమానాలను మరవలేను. భారత్, అమెరికా చర్చలు సానుకూలం. అమెరికాతో స్నేహం మరింత బలపడిందని మోడీ ప్రకటించారు.ఇవాళ చారిత్రాత్మకరోజుగా మోడీ అభివర్ణించారు.

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం


ఉగ్రవాదంపై అనుసరించాల్సిన వ్యూహం గురించి ట్రంప్ యంత్రాంగంలోని కీలకశాఖల కార్యదర్శులు ఇద్దరు భారత ప్రధానమంత్రి మోడీతో చర్చించారు. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిటెర్సన్, రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మేటిస్ పాల్గొన్నారు. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసికట్టుగా పోరాడాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఉగ్రవాదంపై పోరుకు ఎలా సన్నద్దం కావాలి, ఏ విధంగా సహకరించుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. భారత్ తన పొరుగుదేశాలన్నింటితో సత్సంబంధాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తోందని ప్రధాని వారికి వివరించినట్టు భారత విదేశాంగ ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్స్ ను తప్పుపట్టలేదు

సర్జికల్ స్ట్రైక్స్ ను తప్పుపట్టలేదు

పాకిస్తాన్ పై గత ఏడాది భారత్ జరిపిన సర్జికల్ దాడులపై ప్రపంచాన్ని ఒప్పించడంలో భారత్ విజయవంతమైందని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని దోషులుగా నిలబెట్టడంలో అనుకొన్నది సాధించగలిగినట్టుగా ఆయన చెప్పారు. వర్జీనియాలో ఏర్పాటుచేసిన భారతీయ అమెరికన్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు భారత్ ఏమైనా చేయగలదని నిరూపించాయన్నారు. 20 ఏళ్ళ క్రితం ఉగ్రవాదం గురించి మాట్లాడిన సమయంలో ఇతర దేశాలు అర్ధం చేసుకోలేదన్నారు.

భారత్ అమెరికా మధ్య ఆర్థిక సహాకారంపై చర్చ

భారత్ అమెరికా మధ్య ఆర్థిక సహాకారంపై చర్చ


ట్రంప్ తో సమావేశానికి కొద్దిసేపటికి ముందే ఈ సమావేశం జరిగింది. భారత్ అమెరికా ల మధ్య ఆర్థిక సహకారం, వ్యూహత్మక అంశాల్లో భాగస్వామ్యం తదితరాలపై చర్చించారు. ఆఫ్గనిస్థాన్ పరిస్థితులు, దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం గురించి చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+