ఆశీర్వదిస్తానని చెప్పిన పూజారి.. దుస్తుల్లో చేతులు పెట్టి అక్కడ టచ్ చేశాడు - మిస్ గ్రాండ్ మలేషియా

నేటి సమాజంలో మహిళలకు రక్షణ నానాటికీ కరువవుతుంది. పగలు లేదు, రాత్రి లేదు.. ఇంటా కాదు, బయట కాదు.. చిన్నా, పెద్ద ఎవరైనా సరే అంటూ మృగాళ్ళు రెచ్చిపోతూనే ఉంటున్నారు. కాగా ఇప్పుడు పవిత్రతకు ప్రతీకగా నిలవాల్సిన ఆలయం లోనే ఓ మహిళ జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. పవిత్ర జలంతో ఆశీర్వదిస్తానని చెప్పిన ఓ పూజారి.. సదరు మహిళ దుస్తుల్లో చేతులు పెట్టి అక్కడ టచ్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ దారుణ ఘటన మలేషియాలోని సెపాంగ్ జిల్లాలో చోటు చేసుకోగా.. బాధితురాలు భారత సంతతికి చెందిన నటి, మిస్ గ్రాండ్ మలేషియా 2021 టైటిల్ విజేత లిషాలినీ కనరన్పై కావడం హాట్ టాపిక్ గా మారింది. హిందూ పూజారి లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ ఘటనను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వెలుగు లోకి వచ్చింది.

priest-misbehave-with-miss-grand-malaysia-lishalini-at-temple

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మలేషియాలోని సెపాంగ్‌లో ఉన్న మరియమ్మన్ ఆలయాన్ని.. జూన్ 21న లిషాలినీ సందర్శించారు. ఆలయంలో ప్రధాన పూజారి అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక పూజారి పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపింది. ఆ తర్వాత ఆమెను ప్రైవేట్ కార్యాలయానికి తీసుకెళ్లి.. భారతదేశం నుంచి తెచ్చిన పవిత్ర జలంతో ఆశీర్వదిస్తానని చెప్పి మొదట తనపై ఘాటైన ద్రవాన్ని చల్లాడని.. ఆపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. దుస్తుల్లో చేతులు పెట్టి అనుచితంగా తాకాడని వాపోయారు. అంతే కాకుండా తనతో లైంగికంగా కలిస్తే అది "దేవుడికి చేసే సేవ" అవుతుందని చెప్పి వేధించాడని లిషాలినీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ సమయంలో తాను తీవ్ర షాక్‌కు గురయ్యానని.. భయంతో నిశ్చలంగా మారిపోయానని లిషాలినీ చెప్పారు. జూలై 4న పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు. అయితే ఈ విషయాన్ని బయటపెట్టవద్దని, పెడితే నింద తనపైనే పడుతుందని విచారణ అధికారి తనను హెచ్చరించినట్లు ఆమె ఆరోపించారు. తాము ఆలయానికి వెళ్లేసరికే పూజారి పరారయ్యాడని పేర్కొన్నారు.

priest-misbehave-with-miss-grand-malaysia-lishalini-at-temple

గతంలోనూ అతనిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఆలయ యాజమాన్యం పరువు కోసం విషయాన్ని కప్పిపుచ్చిందని ఆరోపించారు. పవిత్ర స్థలంలో జరిగిన ఈ దారుణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల స్పందన..

సెపాంగ్ జిల్లా పోలీస్ చీఫ్ నార్హిజామ్ బహమన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడు భారతీయుడని, తాత్కాలికంగా పూజారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అని పేర్కొన్నారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పూజారి పరారీలో ఉన్నాడని.. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక పవిత్ర స్థలంలో ఈ తరహా అపవిత్ర ఘటనకు పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+