వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సంతాపం: మత్స్యకారుల వల్లే ఎయిర్ఏషియా ఆచూకీ గుర్తింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా qz8501 జావా సముద్రంలో కూలిపోయిన ఘటన పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాపాన్ని తెలియజేశారు. విమాన ప్రయాణీకులు మృత్యువాత పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

162 మందితో ఆదివారం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. ఇండోనేషియా బోర్నియా ద్వీపం సమీపంలో జావా సముద్రంలో విమానం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు గుర్తించినట్లు ఏవియేషన్ సంస్థ తెలిపింది.

కాగా, గాలింపు చర్యల్లో భాగంగా మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. ఆదివారం ఉదయం సముద్రంలో ఏదో పేలిపోయిన శబ్దం వినిపించిందని, తాము దానిని విన్నామని పంగ్ కాలన్ బన్‌కు చెందిన ఇద్దరు మత్స్యకారులు చెప్పిన ఆధారాలతో ప్రమాదస్థలాన్ని అధికారులు గుర్తించారు. కాగా, సముద్రం నీటిలో 50 నుండి 60 మీటర్ల లోతులో విమానం ఉన్నట్లుగా సోనార్ గుర్తించింది.

 ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

ప్రమాదం ఎక్కడ జరిగిందో స్పష్టమైనప్పటికీ దానికి కారణాలు తెలియాల్సి ఉంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

 ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

ఇండోనేషియా వైమానిక దళ విమానం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సముద్రం గర్భంలో ఈ విమానం ఛాయల్ని గుర్తించింది.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

ఉదయం పదింపావు సమయంలో కొన్ని శకలాలు కనిపించాయి. ప్రతికూల వాతావరణం, దాదాపు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాల కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.

 ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

విషాదంతో తన హృదయం బరువెక్కిందంటూ మృతుల కుటుంబాలకు ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండేస్ సంతాపం తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday condoled the families of those who lost their lives in AirAsia Flight QZ8501 after it presumably crashed of the Indonesian coast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X