చిక్కుల్లో విశ్వసుందరి: తాజ్ బెంచీపై చెప్పులు పెట్టి..

Taj Mahal
ఆగ్రా: మిస్ యూనివర్స్ ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో తాజ్ మహల్ వద్ద అనుచిత చర్యకు పాల్పడి చిక్కుల్లో పడ్డారు. ఆదివారం ఆమె బ్యాగులోని చెప్పులను 'డయానా సీట్‌'గా పేర్కొనే పాలరాతి బెంచీపై ఉంచి చెప్పుల కంపెనీ వ్యాపార ప్రకటన కోసం పోజిచ్చినట్లు భారత పురాతత్వశాఖ (ఏఎస్ఐ) ఫొటో ఆధారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు కల్పో, ఫొటోషూట్ నిర్వహించిన ఆమె బృందంలోని వారిపై కేసు పెట్టారు. దివంగత బ్రిటన్ యువరాణి డయానా 1992 నాటి తాజ్ పర్యటనకు గుర్తుగా తాజ్‌లోని ఓ పాలరాతి బెంచీకి 'డయానా సీట్' అని పేరు పెట్టామని, కల్పో ఫొటో షూట్ తతంగం ఈ బెంచీని అగౌరవించడమేనని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాజ్ సంరక్షణ అధికారి మునాజర్ అలీ చెప్పారు. కల్పో భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఆ సంఘటనపై పర్యాటక పోలీసులు విచారణ ప్రారంభించారు. విశ్వసుందరి అనధికారిక చెప్పు ఫొటో షూట్‌పై బుధవారంనాడు కేసు నమోదు చేశారు. అమెరికా జాతీయురాలైన కల్పో ఆదివారంనాడు ఆగ్రాను సందర్శించారు. పది రోజుల పర్యటన కోసం ఆమె భారతదేశం వచ్చారు.

తాజ్ మహల్ ఆవరణలో ప్రచార, బ్రాండింగ్ వ్యవహారాలను సుప్రీంకోర్టు నిషేధించింది. తాజ్ మహల్‌ను సందర్శించే సమయంలో యాత్రికులు చెప్పులను బయటే వదిలేయాల్సి ఉంటుంది. కల్పోపైనే కాకుండా టూర్ మేనేజర్, భారత సంతతికి చెదిన ఫేషన్ డిజైనర్ సంజనా జోన్‌పై, వారి బృందంపై ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+