ఓ వైపు పుతిన్.. మరోవైపు జెలెన్స్‌కీ.. భారత్ పర్యటనకు రెడీ అంటున్న అగ్రనేతలు !
అంతర్జాతీయంగా రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై సుంకాలు విధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలే దీనికి కారణమని వాషింగ్టన్ పేర్కొంది.
అయితే ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరి నాటికి భారతదేశాన్ని సందర్శించనున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ సైతం ఇండియా టూర్ కి రావచ్చని సంకేతాలు అందుతున్నాయి. ఈ ఈ పర్యటన తేదీని ఖరారు చేసేందుకు భారత్, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ తెలిపారు.

గత ఏడాది ఆగస్టులో కీవ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జెలెన్స్‌కీ భారత్‌కు ఆహ్వానించారని గుర్తు చేశారు. పోలిష్‌చుక్ మాట్లాడుతూ.. మాకు దానికి పూర్తి అవకాశం ఉంది. ఇరు పక్షాలు పర్యటనను ఖరారు చేయడానికి కృషి చేస్తున్నారు. అధ్యక్షుడు జెలెన్స్‌కీ త్వరలో భారత్‌లో ఉంటారని ఆశిస్తున్నామన్నారు. ఇది భారత-ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధానికి గొప్ప విజయం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వరుస పర్యటనలతో భారతదేశం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ప్రధాని మోడీ పలు సందర్భాల్లో "ఇది యుద్ధ యుగం కాదు" అని స్పష్టంగా చెప్పి, ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి సాధనలో భారత్ పాత్రను మద్దతుగా ప్రదర్శించారు. ప్రధాని మోడీ.. పుతిన్, జెలెన్స్‌కీ ఇద్దరితోనూ టెలిఫోన్ సంభాషణలు జరిపి, రెండు దేశాల మధ్య శాంతి కోరుతోందని ప్రభుత్వం స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా కవ్వింపు చర్యలతో రష్యా, భారత్, చైనా మధ్య ఆర్ఐసీ త్రయం తిరిగి పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications