భారత్ లో పుతిన్ పర్యటన.. తేదీలు ఇవే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. వార్షిక సమావేశంలో భాగంగా ఆయన డిసెంబర్ 5, 6 భారత్ పర్యటనకు రానున్నట్లు సమాచారం అందుతోంది. భారత్, రష్యాల మధ్య స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్ నర్ షిప్ పూర్తి అయి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల అధినేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గతవారం పుతిన్ పర్యటనపై క్లారిటీ ఇచ్చారు.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ మోత వేళ భారత్- రష్యా మధ్య వార్షిక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇరు దేశాల మధ్య వార్షిక సమావేశాలు 2000 లో ప్రారంభం అయ్యాయి. అయితే కొవిడ్-19 కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ప్రధాని మోదీ గతేడాది జులైలో 22వ భారత్- రష్యా వార్షిక సమావేశంలో భాగంగా మాస్కోలో పర్యటించారు. ఆ సమయంలోనే భారత్ కు పుతిన్ కు ఆహ్వానించారు. ఈ మేరకు ఈ ఏడాది మేలో పుతిన్ పర్యటన ఖరారు అయింది. వరల్డ్ వార్ 2 లో రష్యా విజయానికి ప్రతీకగా నిర్వహించిన 80 వ వార్షిక పరేడ్ లో భాగంగా ప్రధాని మోదీ.. పుతిన్ తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఈ క్రమంలోనే పుతిన్ పర్యటన ఓకే అయింది.

పుతిన్ రాక సందర్భంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్, ఎనర్జీ రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. బ్రిక్స్, ఎస్సీఓ కూటమిలో ఇరు దేశాల పాత్రపై చర్చించనున్నారు. అలాగే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఇప్పటికే తమ వైఖరిని తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలతోనే ఇది సాధ్యం అని పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య 2022 లో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications