వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాలో నో ఎంట్రీ..! పుతిన్ రివర్స్ ఝలక్.. !!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు గత 20 రోజులుగా కొనసాగుతున్నాయి. నగరాలను స్వాధీనం చేసుకుంటూ .. విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో అమెరికా, బ్రిటన్ తోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షల తీవ్రత చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. రష్యా నుంచి దిగుమతి చేసుకోంటున్న ముడి చమురుపై నిషేధం విధించాయి. అయినా రష్యా అధ్యక్షుడు వారి ఆంక్షలను లెక్కచేయడంలేదు. దాడులను మరింత ముమ్మరం చేశారు. ఆగ్రరాజ్యాలకే తిరిగి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అమెరికా రివర్స్ ఝలక్ ఇచ్చారు పుతిన్.

 బైడెన్, హిల్లరీ క్లింటన్ కు నో ఎంట్రీ

బైడెన్, హిల్లరీ క్లింటన్ కు నో ఎంట్రీ

అమెరికా అధ్యక్షుడు బైడెన్ , హిల్లరీ క్లింటన్ తో సహా మొత్తం 12 మందిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆంక్షలు విధించారు. వారికి రష్యాలో ప్రవేశించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కూడా నిషేధం విధించారు. తమ దేశంలోకి ప్రవేశం లేదంటూ రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది.. ఈ రివర్స్ ఝలక్ ఇవ్వడంతో అగ్రరాజ్యాలపై పుతిన్ ప్రతికారం తీర్చుకున్నట్లేనని పలువురు భావిస్తున్నారు.

 నోటోలో చేరేదిలేదన్న జెలెన్ స్కీ..

నోటోలో చేరేదిలేదన్న జెలెన్ స్కీ..

మరోవైపు తమ లక్ష్యం పూర్తయ్యే వరకు ఉక్రెయిన్ పై దాడులను కొనసాగుతూనే ఉంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రాజధాని కీవ్ ను రష్యా సేనలు చుట్టుముట్టాయి. మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా కీలక ప్రకటన చేశారు. తాము నాటోలో చేరదల్చుకోలేదని ప్రకటించారు. దీనికి ప్రజలంతా అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ -రష్యా మధ్య తొలివిడత శాంతి చర్చల సమయంలోనూ జెలెన్ స్కీ ఇదే ప్రకటన చేశారు. తాజాగా మరోసారి నాటో చేరడం లేదని స్పష్టం చేశారు.

Recommended Video

Russia Ukraine Conflict : మా దేశంపై ఆంక్షలు విధిస్తే నష్టపోయేది మీరే! - Putin | Oneindia Telugu
 13,500 మంది రష్యా సైనికులు హతం

13,500 మంది రష్యా సైనికులు హతం


రష్యా సేనలను ఉక్రెయిన్ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ యుద్ధం పోరులో మాస్కోకు భారీగానే నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 13,500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటివరకు 404 యుద్ధ ట్యాంకులు, 95 హెలికాప్టర్లు, 81 యుద్ధ విమానాలు, 1279 ఆర్మీ వాహనాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అంతే కాకుండా 640 యుద్ధ సామాగ్రి వాహనాలు, 36 యాంటీ ఎయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ రష్యా నష్టపోయినట్లు వివరించింది. అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతున్నాయి. యుద్ధ సామాగ్రిని, నిధులను సమకూర్చుతున్నాయి.

English summary
Putin orders US President Biden has no entry into Russia ..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X