Rahul Gandhi:దేవున్ని సైతం మోదీ కన్ఫ్యూజ్ చేయగలడు..!
అమెరికా: దేవున్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మాయచేయగల సత్తా ఉన్న వాడు ప్రధాని మోదీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు. తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రోజున ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేవుని పక్కన మోదీని కూర్చోబెడితే అసలు విశ్వం ఎలా వచ్చిందనే దానిపై దేవునికి క్లాస్ తీసుకుంటాడని దీంతో దేవుడు తాను సృష్టించిన విశ్వం పై కన్ఫ్యూజ్ అవుతాడని రాహుల్ సెటైర్ వేశారు.
ప్రస్తుతం భారతదేశాన్ని కొన్ని వర్గాలు శాసిస్తున్నాయని చెప్పిన రాహుల్ గాంధీ.. వారందరికీ "అన్నీ తెలుసు" అనే జబ్బు ఉందని చెప్పారు.భారత్‌లో వివిధ భాషలు మాట్లాడేవారితో, వివిధ మతాల వారితో కలిసి పెరిగామని ఇప్పుడు వాటిపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అంతా మనకే తెలుసనే భ్రమలో ఉండకూదని మహాత్మాగాంధీ, గురునానక్‌లు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన రాహుల్ గాంధీ... భారత్‌లో మాత్రం కొందరికి అన్నీ తెలుసనే జబ్బుతో ఉన్నారని మండిపడ్డారు.

కొంతమంది సైంటిస్టుకే సైన్స్ నేర్పుతున్నారని, చరిత్రకారులకు చరిత్ర చెబుతున్నారని,ఆర్మీవారికి యుద్ధం గురించి నేర్పుతున్నారని రాహుల్ అన్నారు. వాస్తవానికి వీరికి అసలు ఏమీ తెలియదని చెప్పారు. ఇక తాను చేసిన భారత్ జోడో యాత్ర గురించి వివరించిన రాహుల్ గాంధీ.. జోడో యాత్ర తనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు.

తమిళనాడులోని కన్యాకుమారిలో గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర ఈ ఏడాది జనవరి 30వ తేదీన శ్రీనగర్‌లో ముగిసింది.భారత్ జోడో యాత్ర ద్వారా బంధాలు బలపడ్డాయని, ప్రజలతో మమేకమవడం నేర్పిందని, ప్రజల మనసులను గెలిచేందుకు మంచి అవకాశంగా ఉపయోగపడిందని రాహుల్ అన్నారు. చరిత్రలో ఆధ్యాత్మిక గురువులైన గురునానక్, గురు బసవన్న, నారాయణ గురులు కూడా దేశాన్ని ఏకత్వంలో నడిపించారని గుర్తుచేశారు.
A few people in India are absolutely convinced that they know everything. They think they can explain history to historians, science to scientists and warfare to the army.
— Congress (@INCIndia) May 31, 2023
But at the core of it is mediocrity. They're not ready to listen!
: Sh. @RahulGandhi in San Francisco,… pic.twitter.com/WiJZqygkCk
ఎంపీగా అనర్హత వేటు పడటంతో రాహుల్ గాంధీ తనకున్న డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సరెండర్ చేసి సాధారణ పాస్‌పోర్ట్ పై అమెరికాకు వెళ్లారు. అమెరికాలో ఆయనకు ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ శాంప్రిటోడా ఘనస్వాగతం పలికారు.ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం రాహుల్ గాంధీ రెండు గంటల పాటు వేచిచూడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తనతో పాటు ప్రయాణించిన ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
-
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!












Click it and Unblock the Notifications