Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ లో పాకిస్తాన్ దుర్మార్గం: కొత్తగా మహిళా ఉగ్రవాదులు

గత ఏడాది నవంబర్ లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో సంభవించిన కారుబాంబు పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో 15 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక వెలుగులోకి వచ్చింది. భద్రతా మండలికి పంపించిన నివేదిక ఇది. ఈ కారుబాంబు పేలుడు వెనుక పాకిస్తాన్ ప్రోత్సాహిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు ఇందులో పొందుపరిచింది ఐక్యరాజ్య సమితి. కారు బాంబుతో సహా అనేక దాడులకు బాధ్యత వహించినట్లు లిఖితపూరకంగా తెలియజేసింది. నవంబర్ 9న రెడ్ ఫోర్ట్ పై జరిగిన దాడి కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది.

Red Fort Attack Linked to Jaish-e-Mohammed and Expands with a New Women s Wing Says UNSC Report

అంతకుముందు- అక్టోబర్ 8న జైషే మహ్మద్ నాయకుడు మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అధికారికంగా మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారని తెలిపింది. జైషేలో భాగంగా మహిళా విభాగం జమాత్ ఉల్-ముమినత్ ను అధికారికంగా ప్రకటించారని, ఇది ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని ఐరాస నిర్ధారించింది. మహిళా విభాగం విస్తరణ కోసం భారీగా రిక్రూట్మెంట్లు చేపట్టవచ్చని ఐరాస అభిప్రాయపడింది. అది- అంతర్జాతీయంగా ఉగ్రవాద ముప్పును రెట్టింపు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

దీంతో పాటు- ఇరాక్, లెవెంట్ (డాయిష్)లోని ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వాటికి సంబంధించిన వ్యక్తులు, గ్రూపులు, సంస్థలపై దృష్టి సారించిన పలు తీర్మానాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్‌లో ఇతర సాయుధ వర్గాలతో పొత్తుల కోసం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవెంట్-ఖొరాసన్ (ISIL-K) ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

చాలాకాలంగా ఈ సంస్థ అఫ్ఘానిస్తాన్‌ ఉత్తర ప్రాంతంలోని బదఖాన్ రీజియన్, అలాగే పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో చురుకుగా ఉంటోంది. తన స్లీపర్ సెల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటోంది. ఇది ఆ రీజియన్లకు మాత్రమే పరిమితం కావట్లేదు. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఐరాస నివేదిక పేర్కొంది. గాజా, ఇజ్రాయెల్ వంటి సంక్షోభాల్లో జోక్యం చేసుకోవడం, కొత్త రిక్రూట్మెంట్లు, నిధుల సేకరణకు ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకున్నట్లు వివరించింది.

బలోచ్ లిబరేషన్ ఆర్మీ టీటీపీ (TTP), ఐఎస్‌ఐఎల్-కే మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు లేకపోలేదని ఐరాస అంచనా వేసింది. ఈ రెండూ జాయింట్ గా ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నిర్వహించడం, తమ వనరులను పరస్పరం పంచుకోవడం, దాడులను సమన్వయం చేసుకోవడం, కమాండర్ల సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు తరచూ సాగిస్తోన్నాయని ఐరాస పేర్కొంది. ఇరాన్‌లోని షియా ప్రార్థనా స్థలాలపై దాడి చేయాలనే లక్ష్యాలు కూడా వీటికి ఉన్నాయని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+