పాక్ రాక్షసత్వంపై భారత్ నిప్పులు.. అది బరితెగింపు, దురాక్రమణే!

దక్షిణాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి. సరిహద్దు దేశాలపై తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగంపై పాకిస్తాన్ సైన్యం జరిపిన భయానక వైమానిక దాడులను భారత్ తీవ్రస్థాయిలో ఖండించింది. పాక్ చేసిన ఈ పనిని అత్యంత ఘోరమైన "బరితెగింపు, ప్రత్యక్ష దురాక్రమణ" (Blatant act of aggression) గా భారత్ అభివర్ణించింది. ఈ బాధ్యతారాహిత్య ప్రవర్తన ప్రాంతీయ శాంతికి, సుస్థిరతకు తీవ్ర ముప్పని భారత విదేశాంగ శాఖ (MEA) అత్యంత ఘాటుగా హెచ్చరించింది. సొంత దేశంలో ఎదురవుతున్న అంతర్గత వైఫల్యాలను, వైరుధ్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ పక్క దేశాలపై ఇలాంటి క్రూరమైన హింసకు తెగబడుతోందని భారత్ ప్రపంచం ముందు ఇస్లామాబాద్‌ను ఏకిపారేసింది.

నైతికత లేని 'డబుల్ టాప్' దాడి!

ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దు ప్రావిన్సులైన పక్తియా, పక్తికా, కునార్ లపై పాక్ వైమానిక దళం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్న పౌరులపై బాంబుల వర్షం కురిపించింది. తాలిబన్ ప్రభుత్వం వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఘోర దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా 36 మంది అమాయక పౌరులు సజీవ దహనమవగా, మరో 163 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Regional Peace Threatened India Strongly Rebukes Pakistan s Reckless Airstrikes Inside Afghanistan

అంతేకాదు, ఇక్కడ పాక్ సైన్యం అత్యంత రాక్షసత్వానికి ఒడిగట్టింది. పక్తియా ప్రాంతంలో మొదటిసారి బాంబు దాడి జరిగిన వెంటనే.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి స్థానిక పౌరులు, పొరుగువారు అక్కడికి పరుగున వచ్చారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ ఏమాత్రం మానవత్వం లేకుండా.. రక్షించడానికి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని రెండోసారి కూడా బాంబు దాడి (Double-Tap Attack) కి తెగబడింది. ఈ నైతికత లేని దాడిలోనే అత్యధికంగా 28 మంది గ్రామీణులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆఫ్ఘాన్ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ కన్నీటి పర్యంతమయ్యారు.

ఉగ్రవాదుల ఏరివేత పేరిట పాక్ మైండ్ గేమ్!

అయితే, తాము పౌరులను చంపలేదని, కరాచీలో పారామిలిటరీ దళాలపై జరిగిన దాడికి సూత్రధారులైన 'జమాత్-ఉల్-అహ్రార్' ఉగ్రవాద స్థావరాలనే మట్టుబెట్టామని పాక్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ దాడుల్లో 29 మంది ఉగ్రవాదులు చనిపోయారని పాక్ సమాచార మంత్రి అతావుల్లా తారార్ చెప్పుకొచ్చారు. కానీ, తమ భూభాగంలో ఎలాంటి ఉగ్రవాదులు లేరని, చనిపోయిన వారంతా కడు పేదలు, బిక్షాటన చేస్తూ బతికే నిస్సహాయ పౌరులేనని ఆఫ్ఘన్ గట్టిగా స్పష్టం చేసింది.

పాకిస్తాన్ దురాగతానికి 29 మంది బలి: హెచ్చరికలు పంపిన తాలిబన్లు
పాకిస్తాన్ దురాగతానికి 29 మంది బలి: హెచ్చరికలు పంపిన తాలిబన్లు

భారత్ అండ.. పాక్‌కు గట్టి వార్నింగ్!

ఈ సంక్షోభ సమయంలో భారత్ స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని మరియు దానికి కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించింది. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు నివాళులర్పించిన భారత ప్రభుత్వం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

సొంత ఇల్లు చక్కబెట్టుకోలేక, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. ఇప్పుడు పొరుగు దేశాలపై ఇష్టారాజ్యంగా దాడులు చేయడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారిందని భారత్ దుయ్యబట్టింది. ఈ దాడులతో ఆఫ్ఘాన్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు క్లైమాక్స్‌కు చేరాయి. ఏ క్షణంలోనైనా ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం నుంచి ప్రతీకార దాడులు (Retaliation) జరిగే అవకాశం ఉండటంతో సరిహద్దు అంతటా హై అలర్ట్ ప్రకటించారు.

అర్ధరాత్రి కశ్మీరులో పాక్ నరమేధ వ్యూహం! RDX బాంబులతో అసిమ్ మునీర్ క్రూరత్వం
అర్ధరాత్రి కశ్మీరులో పాక్ నరమేధ వ్యూహం! RDX బాంబులతో అసిమ్ మునీర్ క్రూరత్వం

ఐదేళ్ల నుంచి ఇదే తీరు..

గత 2021 సంవత్సరంలో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల నూతన పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరు పొరుగు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ దెబ్బతింటూ వస్తున్నాయి. తీవ్రవాద చొరబాట్లు, సరిహద్దు రక్షణ లోపాలపై ఇరు పక్షాలు నిరంతరం తీవ్రమైన పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సరిహద్దు వెంబడి తీవ్రమైన ఘర్షణలు జరిగిన తర్వాత, పొరుగు దేశంపై పాకిస్థాన్ సైన్యం జరిపిన అత్యంత విషాదకరమైన వాయుసేన దాడి ఇదే కావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

భారత ప్రభుత్వం ప్రస్తుత దౌత్య పరిస్థితులకు అనుగుణంగా అఫ్గానిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా సరిహద్దు ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ దాడుల వల్ల తీవ్రంగా నష్టపోయిన అఫ్గాన్ కుటుంబాలకు భారత్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఐక్యతను చాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+