బీబీసీ రిపోర్టర్ పైత్యం: లైవ్‌లోనే మహిళను తాకరాని చోట తాకాడు(వీడియో)

Subscribe to Oneindia Telugu

లండన్: ప్రపంచ దిగ్గజ న్యూస్ ఛానళ్లలో ఒకటైన బీబీసీలో పనిచేస్తున్న రిపోర్టర్.. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ రిపోర్టర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ ప్రముఖ ఛానల్లో ప్రముఖ మీడియా ప్రతినిధిగా కొనసాగుతున్న వ్యక్తి ఇలా బాధ్యతను మరిచి ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? అంటూ ధ్వజమెత్తుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. బీబీసీలో మంచి పేరున్న రిపోర్టర్ బెన్ బ్రౌన్. అతని కార్యక్రమాలకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే, బెన్.. బ్రాడ్ ఫోర్డ్‌లోని ఓ ప్రాంతంలో జరిగిన లైవ్ ఇంటర్వ్యూలో నార్మన్ స్మిత్‌ను పలు విషయాలపై ప్రశ్నిస్తున్నాడు.

కాగా, అదే సమయంలో ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉండి జరుగుతున్నది చూడకుండా, మధ్యలో కల్పించుకుంటూ.. 'ఆబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్' అంటూ ఏదో మాట్లాడబోయింది. ఆ సమయంలో తన కుడి చేతిలో మొబైల్ ఫోన్, మరో పుస్తకాన్ని పట్టుకుని ఉన్న బెన్, ఎడమ చేతితో ఆమెను పక్కకు నెట్టాడు.

అంతటితో ఆగకుండా, ఆ యువతి స్థన భాగంపై చేయివేసి గిళ్లాడు బెన్. అది కాస్తా లైవ్‌లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఈ ఘటన తరువాత కొంత ఇబ్బందికి గురైన సదరు యువతి బెన్ భుజంపై చేతితో కొట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

ఆపై బెన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. ఇది దురదృష్టవశాత్తూ జరిగిందని, కావాలని చేసింది కాదని, ఇంటర్వ్యూ మధ్యలో అంతరాయాన్ని నివారించడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చుకున్నాడు. అయినా శాంతించని నెటిజన్లు బెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి సిగ్గుమాలిన పని చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While reporting on live TV, things can get out of control pretty fast and BBC's Ben Brown knows that better than anybody. On Tuesday, the reporter was interviewing his colleague Norman Smith in Bradford, England when a grinning woman entered the shot and stood beside him. She gave a thumbs up and mouthed, "absolutely fantastic". But what happened next was far from fantastic.
Please Wait while comments are loading...