
కరోనా శక్తి సామర్థ్యాలపై రీసెర్చ్: గాలిలో గంటలు, ఉపరితలంపై రోజులు, ఏం తేలింది?
వాషింగ్టన్: ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా ప్రభావమే కనిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. కరోనావైరస్(కొవిడ్- 19)ను అరికట్టేందుకు అన్ని దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.

గాలిలో, ఉపరితలంపై..
అయితే, కరోనావైరస్ శక్తిసామర్థ్యాలపై చర్చ జరుగుతోంది. కరోనా గాల్లో, బయటి ఉపరితలలాపై మనుగడ సాగిస్తుందా? లేదా? అన్నదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే, అమెరికాోల జరిపిన ఓ అధ్యయన ప్రకారం ఈ వైరస్ గాల్లో, ఉపరితలాలపై కొన్ని గంటలపాటు జీవించగలదని తేల్చింది. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ), కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు.
దీనికి సంబంధించిన ఫలితాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్(ఎన్ఈజేఎం)లో ప్రచురించారు.

సార్స్‌తో పోల్చుతూ..
మానవ శరీరం వెలుపల జీవించడంలో గతంలో వచ్చిన సార్స్‌కు ఉన్న సామర్థ్యమే దీనికి కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కారణం వల్లే సార్స్ కంటే కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. కార్డ్‌బోర్డ్‌పై 24 గంటలు, స్టెయిన్‌లెస్ స్టీల్, ప్లాస్టిక్‌పై రెండు, మూడు రోజుల వరకు ఈ వైరస్ జీవించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిశోధనలో ఎంత వాస్తవం?
కాగా, వీరు జరిపిన పరిశోధనా విధానంపై విమర్శలు వస్తున్నాయి. వీరు మనిషి దగ్గు లేదా తుమ్మడాన్ని అనుకరించేందుకు నెబ్యులైజర్‌ను వాడారని, నెబ్యూులైజర్ ద్వారా సృష్టించిన కృత్రిమ దగ్గు లేదా తుమ్ము ఓ మానవుని సాధారణ దగ్గు, తుమ్ముతో ఎలా పోల్చగలమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారం క్రితం ఈ పరిశోధన ఫలితాలు ఓ వెబ్‌సైట్‌లో ప్రచురితమవడంతో అప్పటి నుంచి వీరి పరిశోధనపై విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్‌కు, సార్స్ కు దాదాపు ఒకే తరహా లక్షణాలున్నాయన్న తాజా పరిశోధనలను కూడా కొంతమంది నిపుణులు కొట్టిపారేస్తున్నారు. సార్స్ కంటే కరోనా మరణాలు తక్కువని చెబుతున్నారు. సార్స్ 8వేల మందికి సోకితే 800 మంది మృతి చెందారని, అయితే కరోనా 2లక్షల మందికి సోకితే 8వేల మందే చనిపోయారని గుర్తు చేశారు.

మరింత లోతుగా.. మరో పరిశోధన ఇలా
కాగా, కరోనావైరస్ గాల్లో, ఉపరితలాలపై ఎంత సేపు మనుగడ సాగించగలదన్న దానిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనావైరస్ సోకకుండా ఉండాలంటే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలని, శుభ్రత చర్యలు పాటించాలని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తుకాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనాబారినపడి 8వేల మందికిపైగా చనిపోగా.. 2లక్షల మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పీర్ర్‌వ్యూడ్ న్యూఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్(ఎన్ఈజేఎం) అనే సంస్థ కూడా తన పరిశోధనల ఫలితాలను వెల్లడించింది. కరోనావైరస్ గాలిలో మూడు గంటలపాటు, కాపర్ ఉపరితలంపై నాలుగు గంటలు, కార్డుబోర్డుపై 24 గంటలు, ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ ఉపరితలాలపై 24గంటలపాటు మనుగడ సాగించగలదని ఈ పరిశోధన తేల్చింది.