మళ్లీ దాడి.. ఈ సారి రాకెట్ లాంచర్లు.. ఇద్దరు మృతి
ఆప్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వచ్చిందో లేదో.. వరస దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ దాడి జరగగా.. కాబూల్‌లో ఇవాళ మరోసారి పేలుడు జరిగింది. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. రాకెట్లతో దాడికి పాల్పడ్డారు. ఇది కూడా ఐసిస్ పనే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద దాడిని ముందే అనుమానించిన అమెరికా... ఆ దాడుల తర్వాత కూడా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి కాబూల్‌లో ఉగ్రదాడి జరిగిందని తెలుస్తోంది. తాజా పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది, వారిలో ఒకరు చిన్నారి అని సమాచారం.

Recommended Video
వరుస బాంబు పేలుళ్లతో అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది. కాబూల్‌లో మరిన్ని బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందనే అమెరికా హెచ్చరికల సమయంలోనే ఇవాళ కాబూల్‌లో మరో భారీ పేలుడు సంభవించింది. ఓ రాకెట్... ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ ని ఢీకొట్టిందని..పేలుడుకి ఇదే కారణమని ప్రాథమిక సమాచారం. ఇటీవలే కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 150 మందికి పైగా అప్ఘాన్ పౌరులు,అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటికే ఐసిస్-కే ఉగ్రసంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications