వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

French Open 2021:రోజర్ ఫెదరర్ సంచలన నిర్ణయం.. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన

|
Google Oneindia TeluguNews

పారిస్ : కింగ్ ఆఫ్ టెన్నిస్ స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం విజయాల దిశగా దూసుకెళుతున్న ఈ స్విస్ స్టార్‌కు మోకాలి గాయం తిరగబెట్టడంతో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. శనివారం మ్యాచ్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ తన మోకాలి గాయం తిరగబెడుతోందని ఈ టోర్నమెంటు చివరి వరకు కొనసాగుతానో లేదో అన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశాడు. తన అనుమానమే నిజమైంది. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంటు నుంచి తప్పుకుంటున్నట్లు ఫెదరర్ ప్రకటించాడు. అంతకుముందు శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ జర్మనీ ఆటగాడు డోమినిక్ కోఫర్ పై విజయం సాధించాడు.

శనివారం జర్మనీ స్టార్ డోమినిక్‌తో ఫెదరర్ తలపడ్డాడు. అయితే ఈ మ్యాచ్ సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు సాగింది. ఈ మ్యాచ్‌లో 7-6,6-7,7-6,7-5తో ఫెదరర్ విజయం సాధించాడు. గత 18 నెలల్లో ఇంత సుదీర్ఘంగా ఒక మ్యాచ్‌ ఆడడం ఫెదరర్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.గతేడాది ఫెదరర్‌కు మోకాలి గాయం అవడంతో రెండు సర్జరీలు జరిగాయి. పారిస్‌లో కరోనావైరస్ కారణంగా కర్ఫ్యూ ఉండటంతో ఈ మ్యాచ్‌ ప్రేక్షకులు లేకుండానే జరిగింది. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మూడో టోర్నమెంటులో ఫెదరర్ ఆడుతున్నాడు. ఇక సోమవారం రోజున ఇటలీకి చెందిన మట్టె బెరిటీనీతో ఫెదరర్ తలపడాల్సి ఉండగా టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన బృందంతో చర్చించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెదరర్ తెలిపాడు.

federer

శనివారం జరిగిన మ్యాచ్ తర్వాత ఫెదరర్ మాట్లాడుతూ తాను ఆడటం కొనసాగించాలా లేదా అనేది నిర్ణయించుకోవాల్సి ఉందని చెప్పాడు. మోకాలిపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పిన ఈ స్విస్ ఆటగాడు టెన్నిస్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం కావొచ్చేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్ తర్వాత పరిస్థితి ఏంటనేదానిపై సమీక్ష చేసుకుంటున్నట్లు చెప్పాడు. తిరిగి ఉదయం నిద్రలేవగానే తన మోకాలి గాయం ఎలా ఉందనేదానిపై కూడా చూసుకుంటున్నట్లు చెప్పారు. ఆగష్టు 8వ తేదీకి ఫెదరర్ 40వ ఏటాలోకి అడుగుపెట్టనున్నాడు.

2015 తర్వాత ఫ్రెంచి ఓపెన్‌లో ఫెదరర్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక 30 జనవరి 2020లో చివరిసారిగా ఒక గ్రాండ్ శ్లామ్‌ టోర్నీలో ఫెదరర్ ఆడాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో సెర్బియన్ స్టార్ నోవక్ జకోవిక్‌పై ఓటమిపాలయ్యాడు. మోకాలిగాయంతో గతేడాది ఆటకు దూరమైన ఫెదరర్... 2016లో వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత రెండేళ్లు క్లేకోర్టుపై జరిగే మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ గ్రాస్ కోర్టులపై జరిగే మ్యాచ్‌లపై ఫోకస్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తాను నెగ్గడం పై అస్సలు ఆశలు లేవని చెప్పుకొచ్చాడు. అయితే ఈ నెలలోనే జరిగే వింబుల్డన్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లా ఈ టోర్నమెంటును భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి ప్రాధాన్యత వింబుల్డన్ అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు ఈ స్విస్ స్టార్. ఇక ఫ్రెంచ్ ఓపెన్ ముగియగానే జూన్ 14వ తేదీన హాలేలో జరిగే గ్రాస్ కోర్టు టోర్నమెంటులో ఫెదరర్ ఆడి తద్వారా వింబుల్డన్‌కు సన్నద్ధం కానున్నాడు.

ఇదిలా ఉంటే టాప్‌సీడ్ ప్లేయర్లంతా ఇలాంటి మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. అంతకుముందు మానసిక ఆరోగ్యం సరిగ్గాలేదని పేర్కొంటూ జపాన్ స్టార్ ప్లేయర్ నయోమీ ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోగా తాజాగా మోకాలి గాయం కారణంగా స్విస్ స్టార్ ఫెదరర్ తప్పుకున్నాడు.

English summary
Swiss star Roger Federer said that he has to decide whether to play French open or not after winning the match against German star Dominic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X