Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో బిన్ లాడెన్ తయార్: ట్రంప్ భస్మాసుర హస్తం

పాకిస్తాన్ అణు సామర్థ్యంపై అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ మాజీ అధికారి, పెంటగాన్ అనలిస్ట్ మైఖేల్ రూబిన్ ఘాటు విమర్శలు చేశారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ను ఓ రోగ్ స్టేట్ గా అభివర్ణించారు. అమెరికా గడ్డపై పాక్ సైన్యాధిపతి బెదిరింపులకు పాల్పడటం సమర్థనీయం కాదని అన్నారు.

అమెరికా పర్యటన సందర్భంగా అసీమ్ మునీర్.. ఫ్లోరిడాలో ఆ దేశ సైన్యాధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ మునిగిపోవడం, నాశనం కావడం అంటూ జరిగితే అది ప్రపంచంలో సగం దేశాలను తన వెంట తీసుకుపోతుందని ఆయన హెచ్చరించారు. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పరోక్షంగా భారత్ నూ బెదిరించారు.

Rogue State Former Pentagon analyst remarks on Pakistan

ఈ వ్యాఖ్యలపై తాజాగా మైఖెల్ రూబిన్ ఘాటుగా స్పందించారు. మునీర్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మునీర్ మాటలు తీవ్రవాద సంస్థల భావజాలానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా మునీర్ ను ఒసామా బిన్ లాడెన్ తో పోల్చారు.

బాధ్యత గల ఓ అణ్వస్త్ర దేశంగా పాకిస్తాన్ వ్యవహరించట్లేదని అన్నారు. పాకిస్తాన్ వ్యవహారశైలి అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అసీమ్ మునీర్ మాటలు వింటూ ఉంటే భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ ప్రసంగం విన్నట్టు ఉందని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌కు ప్రస్తుతం కొనసాగుతున్న నాన్-నాటో మిత్రదేశం హోదాను రద్దు చేయాల్సిన అవసరం ఉందని రూబియో అన్నారు. ఉగ్రవాదానికి బాహటంగా మద్దతు ఇచ్చే దేశంగా ప్రకటించాలని, మునీర్‌ను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు.

మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే అమెరికా అధికారులు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆశ్యర్యం వ్యక్తం చేశారు రూబియో. అసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన అరగంటలోనే అతన్ని అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లి, అమెరికా నుండి వెనక్కి పంపించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశాలను కూడా రూబియో తప్పుపట్టారు. ప్రశ్నించారు, విదేశీ ప్రభావానికి ఆయన లోనైనట్టు కనిపిస్తోన్నారని అన్నారు. జార్జ్ బుష్ హయాం నుండి భారత్ తో బలపడుతూ వచ్చిన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ట్రంప్ వైఖరి తీవ్ర విఘాతం కలిగిస్తుందని తేల్చి చెప్పారు.

పాకిస్తాన్ అణు బెదిరింపులు.. పరోక్షంగా ఉగ్రవాదులను కూడా ప్రోత్సహించినట్టవుతుందని, ఐఎస్ఐ వంటి ఏజెన్సీలను దుర్మార్గపు చర్యల దిశగా ప్రేరేపించే ప్రమాదం ఉందని రూబిన్ హెచ్చరించారు. పాకిస్తాన్ ను నియంత్రించడానికి అమెరికా తక్షణ చర్యలు తీసుకోవాలని, బలూచిస్తాన్ వంటి ప్రాంతాలను గుర్తించాలని రూబిన్ కోరారు.

భవిష్యత్తులో పాకిస్తాన్ అణు ఆయుధాలను అమెరికా ప్రత్యేక దళాలు స్వాధీనం చేసుకునే అవకాశాలు లేకపోలేదని రూబిన్ అన్నారు. పాకిస్తాన్ పరిపాలనలో అమెరికా జోక్యం తప్పకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+