వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతం 2.75 కోట్లు: అయినా ఎవరూ రావట్లేదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అక్లాండ్: సంవత్సరానికి రూ. 2.75 కోట్ల జీతం. మూడు నెలలు సెలవులు. ఇంత ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇస్తున్నా, అక్కడ గత రెండేళ్లుగా ఉద్యోగంలో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వివరాల్లోకి వెళితే... న్యూజిలాండ్‌లోని వైకాటో పట్టణం అది. సుమారు 13,600 మంది జనాభా నివసిస్తున్నారు.

ఈ పట్టణంలో డాక్టర్ అలన్ కెన్నీ అనే వైద్యుడు ఓ ఆసుపత్రిని తెరిచాడు. ప్రాక్టీసు బ్రహ్మాండంగా ఉంటోంది. అతి తక్కువ సమయంలో ఆసుపత్రికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి ఆయనకు వీలు కుదరడం లేదు.

వీలు చూసుకుని ఎప్పుడైనా సెలవు పెడితే, ఏదో ఒక ఎమర్జెన్సీ రావడం, మళ్లీ ఆసుపత్రికి రావడం షరా మామూలే అవుతుంది. దీంతో ఆయన తనకు జూనియర్ డాక్టర్‌గా పనిచేసేందుకు ఎవరైనా కావాలని పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఎవరైనా తన వద్ద ఉద్యోగంలో చేరితే ఎంత ఎక్కువ మంది పేషెంట్లను చూస్తే అంత ఎక్కువ జీతం ఇస్తానని కూడా ఆఫర్ చేశాడు..

Rs 2.75 crores per annum salary still post vacant for 2 years in newzealand

అయితే అతని వద్ద ఉద్యోగంలో పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రెండేళ్ల క్రితం డాక్టర్ కెన్నీ కుమార్తె సారా అక్కడ తన తండ్రి వద్ద హౌస్ సర్జన్‌గా చేరారు. కొన్నాళ్ల తర్వాత ఆమె కూడా వెళ్లిపోయింది. తన దగ్గర పని చేసేవాళ్లకు మంచి జీతం, మూడు నెలల సెలవు ఇస్తానని, నైట్ డ్యూటీలు ఉండవని సదరు డాక్టర్ నెత్తినోరు కొట్టుకుంటున్నారు.

అంతేకాదు వారాంతపు సెలవులు కూడా ఉంటాయని, జీతం కాకుండా మొత్తం ప్రాక్టీసులో సగం షేరు ఇస్తానని డాక్టర్ కెన్నీ చెబుతున్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇంతకీ అక్కడికి ఒక్క డాక్టర్ కూడా రాకపోవడానికి కారణం న్యూజిలాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే.

దీంతో న్యూజిలాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్న ఖాళీలను అంతర్జాతయ వైద్యులతో భర్తీ చేస్తున్నామని న్యూజిలాండ్ రూరల్ జనరల్ ప్రాక్టీస్ నెట్‌వర్క్స్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లిండా రేనాల్డ్స్ చెప్పారు.

English summary
Rs 2.75 crores per annum salary still post vacant for 2 years in newzealand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X