మూడేళ్ల రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి పుల్ స్టాప్?: చర్చల్లో అదే కీ పాయింట్

Russia- Ukraine conflict: రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.

ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

Russia and Ukraine agree in Istanbul peace talk to exchange of 1000 prisoners of war each

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది.

అదే సమయంలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడం రష్యాను ఆందోళనకు గురి చేసింది. రెండు రోజుల కిందటే లాంగ్ రేంజ్ మిస్సైల్‌తో రష్యాపై దాడి చేసింది ఉక్రెయిన్. అమెరికా అభివృద్ధి శక్తిమంతమైన క్షిపణి ఇది. ఈ మిస్సైల్‌ను సంధించడంతో తొలిసారిగా ఆత్మరక్షణలో పడినట్టయింది రష్యాకు.

దీనితో రష్యా అనూహ్య దాడికి దిగింది. కొద్దిరోజుల కిందట ఏకంగా ఉక్రెయిన్‌పై హైపర్‌సొనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను సంధించింది. దిన్‌ప్రో సిటీలో విధ్వంసాన్ని సృష్టించిందీ మిస్సైల్. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అలాంటి మిస్సైళ్లను ఈ రెండు దేశాలు ఎన్నింటినో సంధించుకున్నాయి.

ఈ పరిస్థితులకు పుల్ స్టాప్ పడేలా ఉంది. ఈ రెండు దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి వచ్చాయి. వెయ్యిమంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి రష్యా- ఉక్రెయిన్ అంగీకరించాయి. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా సాగుతున్న శాంతి చర్చల సందర్బంగా 1,000 మంది యుద్ధ ఖైదీల మార్పిడి ఏకాభిప్రాయానికి వచ్చాయి.

ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రతినిధుల బృందానికి నాయకత్వాన్ని వహిస్తున్న ఆ దేశ రక్షణ శాఖ మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ వెల్లడించారు. ఎప్పుడు మార్పిడి చేసుకుంటారనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ తేదీ గురించి వివరించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడే పూర్తి వివరాలను వెల్లడించలేమని తేల్చి చెప్పారు.

1,000 మంది యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడి విషయాన్ని రష్యా ప్రతినిధుల బృందం అధిపతి వ్లాదిమిర్ మెడిన్ స్కీ కూడా ధృవీకరించారు. తన దేశ అధికారిక మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుమించి- ఇతర వివరాలను తెలియజేయడానికి నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+