విరుచుకుపడుతోన్న రష్యా- రాత్రికి రాత్రి అతి భీకర దాడి
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.
అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది.

తాజాగా భీకరంగా ఎదురుదాడి చేసింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై భారీ డ్రోన్, క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. 11 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత కీవ్ లో ఓ ప్రధాన ప్రభుత్వ భవనం పైకప్పు నుండి పొగలు వెలువడటం కనిపించింది. అది- కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ భవనం కావొచ్చని అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది. ఇది ప్రత్యక్ష దాడి వల్ల సంభవించిందా? లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.
ఒకవేళ అది ప్రత్యక్ష దాడే అని తేలితే- రష్యా వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేసినట్టవుతుందని అంచనా వేసింది. ఇప్పటివరకు కూడా రష్యా.. కీవ్ ను తన టార్గెట్ గా చేసుకోలేదు. ఎటువంటి ప్రభుత్వ భవనాలపైనా నేరుగా దాడులు జరపలేదు. పరోక్షంగా అవి పాక్షికంగా ధ్వంసమౌతూ వచ్చాయి. ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా ఉక్రెయిన్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ బిల్డింగ్ పై డ్రోన్లతో దాడులకు దిగడం చర్చనీయాంశమౌతోంది.
ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 11 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఏడాది వయస్సున్న ఓ చిన్నారి కూడా ఉన్నట్లు కీవ్ సిటీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ టిమూర్ తెలిపారు. ఆ చిన్నారి మృతదేహాన్ని శిథిలాల నుండి రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. అలాగే కీవ్ శివార్లలోని స్వియాటోషిన్ స్కీ, డార్నిట్ స్కీ జిల్లాల్లోని నాలుగు అంతస్తుల నివాస భవనాలపై రష్యా డ్రోన్ శకలాలు పడినట్లు మేయర్ విటాలీ చెప్పారు.
రెండు వారాల వ్యవధిలో కీవ్‌పై రష్యా జరిపిన రెండో భారీ డ్రోన్, క్షిపణి దాడి ఇది. శాంతి చర్చలపై ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోండటం, వ్లాదిమిర్ పుతిన్ కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యుద్ధం జోరు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications