వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో టాప్ లీడర్‌పై ఆత్మాహుతి దాడికి కుట్ర: రష్యాలో ఐఎస్ ఉగ్రవాది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

మాస్కో/న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్‌ను తమ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బి) సోమవారం తెలియజేసింది. అతను భారతదేశ నాయకత్వ ప్రముఖులలో ఒకరిపై తీవ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నాడని రష్యన్ వార్తా సంస్థ స్పుత్నిక్ ఎస్ఎఫ్బీ పేర్కొందని నివేదించింది.

భారత్‌లో పెద్ద నాయకుడి హత్యకు ఐఎస్ కుట్ర

భారత్‌లో పెద్ద నాయకుడి హత్యకు ఐఎస్ కుట్ర

"రష్యా FSB.. రష్యాలో నిషేధించబడిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించి, నిర్బంధించింది. అతను మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందినవాడు. అతను భారతదేశానికి చెందిన పాలక వర్గాల ప్రతినిధులలో ఒకరిపై తనను తాను పేల్చేసుకోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ప్లాన్ చేశాడు' అని స్పుత్నిక్ ప్రకారం అథారిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

టర్కీలో ఆత్మాహుతి బాంబర్‌గా చేరాడు

టర్కీలో ఆత్మాహుతి బాంబర్‌గా చేరాడు

ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్‌లో అదుపులోకి తీసుకున్న సభ్యుడిని ఐఎస్ నేత ఒకరు టర్కీలో ఆత్మాహుతి బాంబర్‌గా చేర్చుకున్నట్లు సమాచారం.
ఇస్లామిక్ స్టేట్, దాని అన్ని వ్యక్తీకరణలు తీవ్రవాద సంస్థగా ప్రకటించబడ్డాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 మొదటి షెడ్యూల్‌లో యూనియన్ ప్రభుత్వంచే చేర్చబడింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీగా పెరిగిన ఐఎస్ ఉగ్రవాదులు

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీగా పెరిగిన ఐఎస్ ఉగ్రవాదులు

హోం మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఐఎస్ తన భావజాలాన్ని ప్రచారం చేయడానికి వివిధ ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తోంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను సంబంధిత ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్‌ ఉగ్రవాదుల సంఖ్య 6,000కు పెరిగింది:
రష్యా గత ఏడాది తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సభ్యుల సంఖ్య మూడు రెట్లు పెరిగి 6,000కు చేరుకుందని రష్యా అంతకుముందు తెలిపింది.

English summary
Russia's Security Agency Detains ISIS Terrorist Plotting Suicide Attack on top leader In India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X