షరతులకు ఓకే చెప్పండి : తక్షణమే యుద్ధాన్ని ఆపేస్తాం .. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్ !!
ఉక్రెయిన్‌లో రష్యా సేనలు బాంబులతో విరుచుకుపడుతూనే ఉన్నాయి. రాకెట్‌లతో విద్వంసం సృష్టిస్తున్నాయి. యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తులు చేస్తాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వారి మాటలను లెక్కచేయడంలేదు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పట్టణాలను కైవసం చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం మొదలు ఐరోపా దేశాలు ఆంక్షలు విధించినా లెక్కచేయడంలేదు.

చెప్పింది వింటే .. సైనిక చర్చలకు ఫుల్‌స్టాప్
గత 12 రోజులుగా ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. సైనిక చర్యను నిలిపివేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే దీనికి కొన్ని షరతులు విధించింది. తమ షరతులను అంగీకరిస్తే.. తక్షణమే యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. తమ సైనిక చర్యలను ఆపేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించడంతో పాటు, ఏ కూటమిలోనూ చేరకుండా అది అడ్డుకునేలా ఉండాలని స్ఫష్టం చేశారు. ఈ షరతులకు ఉక్రెయిన్ అంగీకరించినట్లైతే తక్షణం యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతామని తేల్చిచెప్పింది.

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మూడో విడత చర్చలు
మరోవైపు రష్యా -ఉక్రెయిన్ ప్రతినిధులు మూడో విడత చర్చలు ప్రారంభించారు. ఇప్పటికే రెండు సార్లు వారి మధ్య చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మూడో విడత చర్చలైనా సఫలం కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఇరుదేశాల చర్చలపై ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ చర్చలు ఫలిస్తే గత 12 రోజులుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధపోరుకు ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రస్తుతం నాలుగు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కివ్, సుమీ, మారియుపోల్ నగరాల్లోని ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టింది. మానవతా కారిడార్ లను ప్రాంభించినట్లు ప్రకటించాయి.
ఉక్రెయిన్‌ను వీడిన 17 లక్షల మంది
అటు రష్యా యుద్ధ చర్యలతో లక్షలాది మంది ఉక్రెయిన్ వాసులు పొరుగుదేశాలకు తరలివెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ యూఎన్‌హెచ్ సీఆర్ పేర్కొంది. ఇప్పటివరకు 17 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడారని తెలిపింది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరిగిన శరణార్థుల సంక్షోభం ఇదేనని వెల్లడించింది. ఈ యుద్ధానికి ముగింపు పలకకపోతే రానున్న రోజుల్లో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు తలెత్తనున్నాయని యూఎన్‌హెచ్‌సీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications