Russia-Ukraine: బాంబ్ షెల్టర్లలోనే 4వేల మంది భారతీయ విద్యార్థులు, న్యూ అడ్వైజరీస్

న్యూఢిల్లీ: చర్చలు విఫలమైన క్రమంలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను మరింతగా పెంచాయి. దీంతో అనేక మంది ప్రజలు, సైనికులు మృతి చెందినట్లు సమాచారం. రష్యా దాడులు ఉధృతం చేసిన క్రమంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను మరింత వేగం పెంచింది.

ఇప్పటికే 17వేల మందికిపైగా భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, మరో 4వేల మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారని తెలిపింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం రెండు "అత్యవసర సలహాలు" జారీ చేసింది, ఖార్కివ్‌లోని భారతీయ పౌరులు వెంటనే నగరాన్ని విడిచిపెట్టి, పిసోచిన్, బెజ్లియుడివ్కా, బాబాయ్ అనే మూడు స్థావరాలకు - రాత్రి 9.30 (ఉక్రేనియన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) చేరుకోవాలి అని స్పష్టం చేసింది.

Russia-Ukraine: 4,000 students remain in bomb shelters, As Indian govt issues urgent advisories to leave Kharkiv

ఖార్కివ్ డోన్‌బాస్ ప్రాంతానికి ఉత్తరాన తూర్పు ఉక్రెయిన్‌లో ఉంది. నగరంలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో (సుమారు 3,500 మంది) చేరారు, ఇతరులు వీఎన్ కరాజిన్ ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ, ఖార్కివ్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్శిటీ వంటి కళాశాలలకు చెందినవారు.

పిసోచిన్ ఖార్కివ్ నగర కేంద్రానికి పశ్చిమాన 11 కి.మీ, బెజ్లీ దివ్కా దక్షిణాన 16 కి.మీ, బాబాయ్ నైరుతి దిశలో 12 కి.మీ కాలినడకన వెళుతున్నారు. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల తరలింపు కోసం "మానవతా కారిడార్"ను ప్రారంభించే పనిలో ఉన్నట్లు రష్యా ముందు రోజు తెలిపింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న సుమారు 20,000 మంది భారతీయులలో సుమారు 17,000 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని, రొమేనియా, పోలాండ్, హంగేరి, స్లోవేకియా, మోల్డోవా మీదుగా భారతీయులను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ బుధవారం తెలిపారు.

కాగా, రష్యా దాడుల్లో సుమారు వెయ్యి మందికిపైగా సామాన్య ప్రజలు, వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ తెలిపింది. అదే సమయంలో రష్యాకు చెందిన 5వేల మంది సైనికులు హతమయ్యారని వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ ను తమస్వాధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అందుకే నగరాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 10లక్షల మంది ఉక్రెయిన్ దాటి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+