రష్యా సైన్యం అధీనంలో ఉక్రెయిన్ కీవ్ ఎయిర్ పోర్ట్.. భారతీయుల కోసం కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. బాంబులతో రష్యా సైన్యం ఉక్రెయిన్ పై విరుచుపడుతోంది. తొలుత సైనిక స్థావరాలే తమ లక్ష్యమని రష్యా ప్రకటించినప్పటికీ .. క్రమంగా నివాసాలపై కూడా దాడులకు పూనుకుంది. దీంతో పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భీకర బాంబుల శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్రెయిన్ - క్రిమియా సరిహద్దు దాటి ఉక్రెయిన్ భూబాగంలోకి రష్యా సైనిక బలగాలు ప్రవేశించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్ పోర్టును రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్నారు.
Recommended Video

కీవ్‌లో భారతీయులు పడిగాపులు
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు చేపట్టడంతో తన గగనతలాన్ని మూసివేసింది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చింది. దీంతో వేల సంఖ్యలో భారతీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కీవ్ లో వందలాది మంది భారత పౌరులు పడిగాపులు కాస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణం
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటుందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
అటు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీ.మురళీధరన్ స్పందించారు. వారిని భారత్ కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా వారి కోసం ఓ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులతో పాటు మొత్తం 18వేలమందికి పైగా భారతీయులు ఉక్రెయిన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది . దీంతో భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications