Russia VS Ukraine: భారత్ కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా, డిస్కౌంట్ ఆయిల్ కోసం రిస్క్ లో పడోద్దు!
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పై విరుచుకుపడి తన ప్రతాపం చూపిస్తున్న రష్యాను ఒంటరి చెయ్యాలని ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అగ్రదేశం అమెరికా సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా భారత్ వ్యూహాత్మకంగా రష్యాతో సంబంధాలు నెరుపుకుంటున్నాయని అమెరికాతో పాటు దాని మిత్రపక్షదేశాలు భారత్ మీద మండిపడుతున్నాయి. భారత వైఖరి ఏమిటో మాకు అర్థం కావడం లేదని అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి.
రష్యా మీద ఆధారపడటం భారత్ తగ్గించుకోవాలని అమెరికా దాని మిత్రపక్ష దేశాలు భారతదేశం మీద మండిపడుతున్నాయి. రష్యా నుంచి భారత్ చౌకగా (డిస్కౌంట్) చమురు కొనుగోలు చెయ్యాలని భారత్ ప్రయత్నిస్తున్నదని అమెరికా దాని మిత్రపక్ష దేశాలు ఆరోపిస్తున్నాయి. రష్యాను ఒంటరి చెయ్యడానికి మాకు సహకరించాలని అమెరికా భారత్ ను పరోక్షంగా హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అమెరికా దాని మిత్రపక్షాలు చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

రష్యాను ఒంటరి చెయ్యడం అమెరికా లక్షం
ఉక్రెయిన్ పై విరుచుకుపడి తన ప్రతాపం చూపిస్తున్న రష్యాను ఒంటరి చెయ్యాలని ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బ తియ్యాలని స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను ప్రపంచదేశాలు తొలగించాయి.
బెల్జియం ఆధారితక క్రాస్-బోర్డర్ చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్ ను ఉపయోగించకుండా అమెరికా, యూరిపోపియన్ యూనియన్ 7 రష్యన్ బ్యాంకును నిషేధించింది. ఇలా రష్యాను వీలైనంత వరకు ఆర్థికంగా దెబ్బ తియ్యాలని అమెరికా దాని మిత్రపక్ష దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

భారత్ వైఖరి అర్థం కావేడంలేదు
అగ్రదేశం అమెరికా సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా భారత్ వ్యూహాత్మకంగా రష్యాతో సంబంధాలు నెరుపుకుంటున్నాయని అమెరికాతో పాటు దాని మిత్రపక్షదేశాలు భారత్ మీద మండిపడుతున్నాయి. భారత వైఖరి ఏమిటో మాకు అర్థం కావడం లేదని అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి.

రష్యాను అడ్డుకుందాము
అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడే సమయం వచ్చింది. రష్యా అధ్యక్షుదు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న యుద్దానికి ఎవ్వరూ కూడా ఎలాంటి సాయం చెయ్యకూడదని యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమాండో ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. రష్యాను ఒంటరి చేస్తేనే ఉక్రెయిన్ మీద యుద్దం ఆగిపోతుందని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

చమురు డిస్కౌంట్ కు వస్తుందని?
రష్యా మీద ఆధారపడటం భారత్ తగ్గించుకోవాలని అమెరికా దాని మిత్రపక్ష దేశాలు భారతదేశం మీద మండిపడుతున్నాయి. రష్యా నుంచి భారత్ చౌకగా (డిస్కౌంట్) చమురు కొనుగోలు చెయ్యాలని భారత్ ప్రయత్నిస్తున్నదని అమెరికా దాని మిత్రపక్ష దేశాలు ఆరోపిస్తున్నాయి. భారత్ ఆర్థిక ప్రయోజనాల కోసం రష్యాతో స్నేహంగా ఉండాలని ప్రయత్నిస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్నది.

రష్యా విదేశాంగ మంత్రి భారత్ వస్తున్న సమయంలో?
రష్యాను ఒంటరి చెయ్యడానికి మాకు సహకరించాలని అమెరికా భారత్ ను పరోక్షంగా హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అమెరికా దాని మిత్రపక్షాలు చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ప్రభావాన్ని ఎదుర్కొవడానికి ప్రయత్నిస్తున్న క్వాడ్ లోని సభ్యదేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భారత్ తీరుపట్లు మండిపడుతున్నాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications