వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రికి కిటికిలోంచి పడి రష్యన్ ఆయిల్ చీఫ్ మృతి: ఏడాదిలో ఎనిమిదవ మిస్టరీ డెత్

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా చమురు దిగ్గజం లుకోయిల్‌ ఛైర్మన్‌ రవిల్‌ మగనోవ్‌ మాస్కోలోని ఆస్పత్రి కిటికీ నుంచి కిందపడి మరణించారు. ఈ మేరకు వివరాలను రాయిటర్స్‌ వెల్లడించింది.

మగనోవ్ సెంట్రల్ క్లినిక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మాస్కో టైమ్స్ ప్రకారం.. రష్యా రాజకీయ, వ్యాపార వర్గాల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులకు చికిత్స చేయడంలో పేరుగాంచింది ఈ ఆస్పత్రి.

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని మార్చిలో ముగించాలని లుకోయిల్ గతంలో పిలుపునిచ్చారు. కాగా, ఈ సంవత్సరం రహస్యంగా మరణించిన రష్యన్ ఒలిగార్చ్‌ల వరుసలో మగనోవ్ తాజాది.

బీబీసీ ప్రకారం.. మాజీ లుకోయిల్ మేనేజర్, అలెగ్జాండర్ సబ్బోటిన్ , ఈ ఏడాది మేలో మాస్కో సమీపంలోని ఒక షమన్ ఇంటిలో చనిపోయారు.

గాజ్‌ప్రోమ్ ఇన్వెస్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్ హెడ్ లియోనిడ్ షుల్మాన్ జనవరి 2022లో లెనిన్స్కీలో చనిపోయాడు.

మరో టాప్ గాజ్‌ప్రోమ్ ఎగ్జిక్యూటివ్, అలెగ్జాండర్ త్యులాకోవ్ , ఒక నెల తర్వాత అదే గ్రామంలో చనిపోయినట్లు గుర్తించారు.

Russian oil chief dies in ‘fall from hospital window’: 8th mysterious death in this year

డైలీ మెయిల్ ప్రకారం .. మిఖాయిల్ వాట్‌ఫోర్డ్, ఉక్రేనియన్-జన్మించిన రష్యన్ బిలియనీర్, ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌లోని తన ఇంటిలో చనిపోయాడు.

మెడ్‌స్టామ్ యజమాని, వాసిలీ మెల్నికోవ్ మార్చి చివరిలో నిజ్నీ నొవ్‌గోరోడ్‌లో అతని కుటుంబంతో సహా చనిపోయాడు.

గాజ్‌ప్రోమ్‌బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్, వ్లాడిస్లావ్ అవయేవ్ ఏప్రిల్‌లో తన మాస్కో అపార్ట్‌మెంట్‌లో తన భార్య, కుమార్తెతో శవమై కనిపించాడు.

ఒక రోజు తర్వాత, నోవాటెక్‌లో మాజీ ఎగ్జిక్యూటివ్ (పాక్షికంగా గాజ్‌ప్రోమ్ యాజమాన్యం) సెర్గీ ప్రోటోసెన్యా అతని భార్య, కుమార్తెతో కలిసి బార్సిలోనాకు ఉత్తరాన చనిపోయాడు. కాగా, ఇటీవల ఓ కీలక నేత కుమార్త కూడా కారులో బాంబు పేలి మరణించిన విషయం తెలిసిందే.

English summary
Russian oil chief dies in ‘fall from hospital window’: 8th mysterious death in this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X