వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాకు ఎదురుదెబ్బ : ఉక్రెయిన్‌కు లొంగిపోతున్న సైనికులు.. భారీ ఆఫ‌ర్‌తో స్వాగతం ..!!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. క్షిపణులు, మిస్సైల్స్‌తో దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. నగరాలను శ్మశానాలుగా మార్చేస్తోంది. నెల రోజులుగా రష్యా సేనలు ఉక్రెయిన్ పట్టణాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కానీ పూర్తిస్థాయిలో పట్టుమాత్రం సాధించలేకపోయింది. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనలతో మాస్కో బలగాలు ముందుకు సాగలేకపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 17వేల మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ ఆర్మీ హతమార్చింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేసింది, యుద్ధ‌ ట్యాంకులను, వాహ‌నాల‌ను ధ్వంసం చేసింది.

Recommended Video

Russia Ukraine Conflict : భారీ ఆఫ‌ర్‌ ప్రకటించిన Ukraine,లొంగిపోతున్న Russia సైనికులు
 ర‌ష్యా యుద్ధ ట్యాంకులు స్వాధీనం

ర‌ష్యా యుద్ధ ట్యాంకులు స్వాధీనం


ఉక్రెయిన్ సేనల తీవ్ర ప్రతిఘటనలతో రష్యాకు లాజిస్టిక్ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో మాస్కో బలగాలలో ధైర్యం సన్నగిల్లి ముందుకు సాగలేకపోతున్నాయి. భీకర దాడులతో ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకుందామనుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌ కాస్త గురితప్పుతోంది. తొలి రోజుల్లో ఉన్న ఊపు ప్రస్తుతం ఆదేశ సైనికుల్లో లేదని బ్రిటన్ ఇంటలిజెన్స్ రిపోర్టు పేర్కొంది. దాడుల్లో భాగంగా 1500 యుద్ధ ట్యాంకులను మాస్కో దింపితే వాటిల్లో 10 శాతానికి పైగా ట్యాంకులను ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేశాయి. అదే సమయంలో రష్కా సేనలు 34 ఉక్రెయిన్ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నాయి. కానీ ఉక్రెయిన్ బలగాలు మాత్రం రష్యాకు చెందిన 117 ట్యాంకులను హస్తగతం చేసుకున్నాయి. దీంతో గతంలో కంటే ఉక్రెయిన్ యుద్ధట్యాంకుల బలం కాస్త పెరిగింది.

 ఉక్రెయిన్‌కు లొంగిపోయిన మాస్కో సైనికుడు

ఉక్రెయిన్‌కు లొంగిపోయిన మాస్కో సైనికుడు


మరోవైపు రష్యా సేనల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వారిలో కొందరు ఉక్రెయిన్‌కు లొంగిపోతున్నారు. అంతే కాకుండా వారి ఆధీనంలో ఉన్న ఆయుధాలను అప్పగించేస్తున్నారు. తాజాగా రష్యా చెందిన మిషి అనే సైనికుడొకరు లొంగిపోయారు. తన వద్ద ఉన్న అత్యాధునిక టి-72 బి3 యుద్ధ ట్యాంకును కూడా ఉక్రెయిన్ పరం చేశాడు. దీని బదులుగా అతను ఉక్రెయిన్ పౌరసత్వంతో పాటు, 7,500 పౌండ్ల రివార్డును పొందనున్నాడు. తాము అర్థం లేని యుద్ధం చేస్తున్నామని ఆ సైనికుడు పేర్కొన్నట్లు ఉక్రెయిన్ మంత్రి విక్టర్ ఆండ్రుసివ్ తెలిపారు. మిషాను ప్రస్తుతానికి యుద్ధఖైదీగానే పరిగణిస్తున్నప్పటికీ.. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విక్టర్ తెలిపారు. మాస్కో దళాలకు తినడానికి తిండి దొరకని పరిస్థితి నెలకొందన్నారు.

 ర‌ష్యా పైల‌ట్ల‌కు భారీ ఆఫ‌ర్

ర‌ష్యా పైల‌ట్ల‌కు భారీ ఆఫ‌ర్


మరోవైపు రష్యా యుద్ధవిమానాలను, హెలికాప్టర్లను స్వాధీనం చేసుకున్న వారిని ఉక్రెయిన్ ఆఫర్లు ప్రకటించింది. యుద్ధవిమానాన్ని స్వాధీనం చేసుకుని తమకు అప్పగిస్తే 10 లక్షల డాలర్లు అందిస్తామని తెలిపింది. అంతేకాదు హెలికాప్టర్‌కు 5లక్షల డాలర్లు , యుద్ధ ట్యాంకులకు కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ కేవ‌లం ఉక్రెయిన్ సైనికులకే కాదు.. రష్యా పైలట్లకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. రష్యా సేనలకు భంగపాటు తప్పదని .. లొంగిపోతే మీకే మంచిదంటూ ఉక్రెయిన్ హెచ్చరిస్తోంది.

English summary
Big Shock to Russia: Soldiers surrendering to Ukraine .. Welcome with a huge offer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X