ఉక్రెయిన్ మహిళపై రష్యా సైనికులు అత్యాచారం .. భర్తను చంపి.. కొడుకు ముందు దురాగతం..

ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోపక్క క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దురాక్రమణకు దిగుతున్నాయి. వరుస దాడులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ బాంబులు దూసుకోస్తాయన్న భయంతో బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది పౌరులు వలసలు వెళ్లిపోయారు. ఉన్న వారికి ఆహారం, త్రాగునీరు తొరకడం లేదు. కనీస సౌకర్యాలు కూడా పౌరులకు అందనియ్యకుండా రష్యా దళాలు అడ్డుకుంటున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

భ‌ర్త‌ను చంపి మ‌హిళ‌పై అత్యాచారం

భ‌ర్త‌ను చంపి మ‌హిళ‌పై అత్యాచారం

ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల దురాగతాలు పాల్పడుతున్నారు. వారి ఆకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్లల్లోకి జోరబడి నీచానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒక‌టి వెలుగులోకి వచ్చింది. రష్యా సైనికులు తమ ఇంటిపై దాడి చేసి.. తనను అత్యాచారం చేసినట్లు ఉక్రెయిన్ చెందిన ఓ మహిళ బోరున విల‌పించింది. తొలుత తమ పెంపుడు కుక్కను చంపారు. ఆ తర్వాత అడ్డువచ్చిన తన భర్తను కూడా కాల్చిచంపారని తెలిపింది.

కొడుకు ముందు ర‌ష్యా సైనికుల దురాగ‌తం ..

కొడుకు ముందు ర‌ష్యా సైనికుల దురాగ‌తం ..

రష్యా సైనికులు తన తలపై గన్ పెట్టి తాము చెప్పినట్లు వినకపోతే తనను చంపేస్తామని బెదిరించారని ఆమె వాపోపోయింది. ఇద్దరు సైనికులు ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేశారని కన్నీటిపర్యంతమైంది. ఆ సమయంలో తన నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్ రూంలో గుక్కపెట్టి ఏడుస్తున్నా పట్టించుకోలేదు. తన తలపై తుపాకీ పెట్టి బెదించారని తెలపింది. నీ భర్త నాజీ కాబట్టి తాము కాల్చామని సైనికులు చెప్పాడని ఆమె పేర్కొంది. రెండు వారల కిందట జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

భ‌ర్త శ‌వాన్ని వ‌దిలి..

భ‌ర్త శ‌వాన్ని వ‌దిలి..

ఈ ఘటన తర్వాత తాము అక్కడి నుంచి భయంతో పారిపోయామని ఆమె తెలిపింది. తన భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశామని చెప్పింది. ఆమె చేసిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. రష్యా సైనికులు తమ పౌరుల పట్ల దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టింది. ప్ర‌పంచ‌దేశాలు ర‌ష్యా చేస్తున్న దుర్మార్గాల‌ను గుర్తించాల‌ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+