భారత్ తో చర్చలకు మేం సిద్దం: పాక్
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఏలాంటి షరతులు లేకుండా భారత్ తో చర్చలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. పాక్-భారత్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదని అన్నారు.
శనివారం ఆయన ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం న్యూఢిల్లీ లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు ఫలిస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

అయితే భారత్-పాక్ దేశాల శాంతి చర్చలలో మూడో పక్షం ప్రమేయం ఉండరాదని భారత్ మొదటి నుండి చెబుతున్నది. అయితే పాక్ ఈ చర్చలు జరగక ముందే కాశ్మీర్ వేర్పాటు వాదులతో చర్చలకు ఆహ్వానించాడాన్ని భారత్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది.
గతంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లు నిర్ణయించిన శాంతి చర్చలకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అయితే పాక్ సైన్యం నవాజ్ షరీఫ్ మీద ఒత్తిడి తీసుకు వచ్చి చర్చలలో కాశ్మీర్ సమస్య తీసుకురావడానికి ప్రయత్నించడంతో భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది.












Click it and Unblock the Notifications