పాకిస్థాన్ కు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ముస్లిం దేశం.. దెబ్బ అదుర్స్ కదూ..
భారత్- పాకిస్థాన్ యుధ్దం నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాకిస్థాన్ పై విరుచుకు పడుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. భారత్ క్షిపణి దాడులకు పాకిస్థాన్ అల్లాడిపోతోంది.
ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో పాకిస్థాన్ లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ లను సౌదీ అరేబియాలో నిర్వహించాలని ఆ దేశానికి రిక్వెస్ట్ పెట్టుకుంది పాకిస్థాన్. ఈ మేరకు సౌదీ అరేబియాలోని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యర్థన చేసింది. మిగతా మ్యాచ్ లను సౌదీలో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

అయితే పాకిస్థాన్ అభ్యర్థనను సౌదీ అరేబియా తోసిపుచ్చినట్లు సమాచారం. భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లను సౌదీలో నిర్వహించేందుకు ఆ దేశం నో చెప్పినట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్ అయోమయంలో పడింది.
మరోవైపు భారత్- సౌదీ అరేబియాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అవి మరింత దృఢంగా మారాయి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐకూ మంచి రిలేషన్ ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు అక్కడే జరిగాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా సౌదీలోనే జరిగింది.
ఇక భారత్-పాక్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ 2025టోర్నీపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిన్న ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ ను అర్ధాంతరంగా నిలిపేసింది. ఇవాళ టోర్నీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ ను ఎక్కుపెట్టింది భారత్ సైన్యం. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 400 డ్రోన్లతో దాడికి పాల్పడింది. అయితే భారత్ ఆ దాడులను తిప్పి కొట్టింది.












Click it and Unblock the Notifications