వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక దాడి: అమెరికాలో సౌదీ యువరాజు అరెస్టు

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజెలిస్: లైంగికదాడి కేసులో సౌదీ అరేబియా యువరాజును అమెరికాలోని లాస్ ఏంజెలిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఆ యువరాజును పూచికత్తు పై విడుదల చేశారు.

మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ (28) అనే యువరాజు లాస్ ఏంజెలిస్ లో ఉన్న ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన బెవెర్లీ హిల్స్ ఎస్టేట్ ప్యాలెస్ ను కొన్ని వారాల పాటు అద్దెకు తీసుకున్నారు. మజీద్ అందులోనే బస చేశాడు.

తనతో శృంగారంలో పాల్గోనాల్సిందిగా ఓ పనిమనిషిని మజీద్ బలవంతం చేశాడని పోలీసులు అంటున్నారు. అయితే ఆమె అందుకు నిరాకరించిందని, తరువాత ఆమె మీద మజీద్ లైంగిక దాడి చేశాడని పోలీసులు చెప్పారు.

Saudi Arabian prince arrested in Los Angeles

అయితే ఆమె తప్పించుకుని తీవ్ర రక్తస్త్రావంతో ఎస్టేట్ ప్రహారీ గోడ దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పొరుగునున్న వారు చూసి ఫిర్యాదు చేశారని పోలీసులు అన్నారు. మజీద్ ను అరెస్టు చేసి విచారణ చేసి వివరాలు సేకరించామని పోలీసు అధికారులు చెప్పారు.

తరువాత మరుసటి రోజు రూ. రెండు కోట్ల పూచీ కత్తుపై మజీద్ ను విడిచి పెట్టామని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 19వ తేదిన మజీద్ కోర్టు లో హాజరుఅవుతున్నాడని అన్నారు. అయితే ఈ విషయంపై సౌదీ యువరాజు స్పందించటానికి అందుబాటులోకి రాలేదు.

అదేవిధంగా సౌదీ అరేబియా ప్రభుత్వం, సౌదీ దౌత్య కార్యాలయం అధికారులు సైతం స్పందించలేదు. సౌదీ యువరాజు లైంగిక దాడికి పాల్పడ్డారని వెలుగు చూడటంతో గల్ఫ్ తో పాటు పలు దేశాలు ఉలిక్కిపడ్డాయి.

English summary
Majed Abdulaziz Al Saud, 28, was arrested on Wednesday and was released on $300,000 bond the next day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X