సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో భారతీయ కార్మికులపై జరుగుతున్న అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. పని చేసే దగ్గర పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఫిర్యాదు చేసిందనే నెపంతో ఓ భారతీయ మహిళ చేతులను నరికేశారు ఆ ఇంటి యజమాని.
తమిళనాడుకు చెందిన బాధిత మహిళను కస్తూరి మునిరథినమ్(50)గా గుర్తించారు. గత కొంత కాలంగా ఆమె సౌదీ అరేబియా రాజధాని నగరమైన రియాద్‌లోని ఓ ఇంట్లో సహాయకురాలి(పని మనిషి)గా పని చేస్తోంది.

సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యజమానుల చిత్రహింసలు భరించలేక వారి ఇంటి బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమె చేతులు నరికేశారు యజమాని.
Chopping of hand of Indian lady - We are very much disturbed over the brutal manner in which Indian lady has been treated in Saudi Arabia.
— Sushma Swaraj (@SushmaSwaraj) October 9, 2015 కాగా, ఈ దారుణ ఘటనను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాము ఇలాంటి ఘటనలు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఓ భారత మహిళను ఈ విధంగా చిత్రహింసలకు గురిచేయడం తమను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.
బాధితురాలితో భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని సుష్మా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, మూడు నెలల క్రితం సౌదీ వెళ్లిన బాధితురాలు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications