Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"మాపై ఈగ వాలినా ఆ దేశం ఊరుకోదు".. భారత్ కు పాకిస్థాన్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య ఇటీవల జరిగిన రక్షణ ఒప్పందం ప్రకారం ఒకవేళ భారత్.. పాకిస్థాన్ పై దాడి చేస్తే సౌదీ అరేబియా భారత్ ను అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. ఇరు దేశాలపై ఏ దేశం దాడికి పాల్పడినా ఆ దేశాన్ని తమ శత్రువుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య ఒప్పందం కుదిరినట్లు పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.


పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ స్థానిక జియో టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సౌదీ అరేబియాతో పాకిస్థాన్ కు రక్షణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ డీల్ మేరకు పాకిస్థాన్ పై ఒకవేళ భారత్ దాడికి పాల్పడితే అది సౌదీ అరేబియాపై దాడిగా ఇరు దేశాలు పరిగణిస్తాయని అన్నారు. వెంటనే సౌదీ దేశం భారత్ కు అడ్డుపడుతుందని ఈ మేరకు ఇరు దేశాల మధ్య బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ కుదిరినట్లు ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ లోని అణు సామర్థ్యాలను సౌదీ అరేబియా వినియోగించుకోవచ్చని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఇది అతిపెద్ద వివాదాస్పదమైన నిర్ణయం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇటీల పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సౌదీ అరేబియాలో పర్యటించారు. రియాద్ లోని యమనా ప్యాలెస్ లో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాక అడ్వాన్స్ డ్ డిఫెన్స్ టెక్నాలజీని ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకోనున్నాయి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా షేరింగ్ చేసుకోనున్నట్లు సమాచారం అందుతోంది.

Saudi Shield Pakistan s Khawaja Asif Reveals Riyadh s Vow to Defend Against India in War

మరోవైపు, సౌదీ అరేబియా-పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంపై భారత్‌ తాజాగా స్పందించింది. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దానిని మేం పరిశీలిస్తున్నామని వివరించింది. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+