విశ్వంలో మరో ‘భూమి’! మనలాగే నీళ్లు, ఆక్సిజన్? మరి ‘వాళ్లూ’ ఉండే ఉంటారా?

విశ్వంలో మన భూమిని పోలిన, అదే పరిమాణం కలిగిన గ్రహం ‘రోజ్‌ 128బీ’ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రశాంతమైన మరుగుజ్జు నక్షత్రం ‘రోజ్‌ 128’ చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం భూమికి 11 కాంతి సంత్సరాల దూరంలో ఉంద

జెనీవా: మన భూమిపై కాకుండా విశ్వంలో ఇంకెక్కడైనా జీవం ఉందా? భూమ్మీది లాంటి వాతావరణమే మరో గ్రహంపై ఉందా? గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారా? ఇవీ.. ఎంతో కాలంగా ఖగోళ శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.

అసలు గ్రహాంతర వాసుల చెప్పుచేతల్లోనే మనం నడుస్తున్నామంటూ ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదన కూడా చేశారు. అయితే మరికొందరు దీనిని ఒప్పుకోలేదు. కానీ తాజాగా మన భూమి లాంటి మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

భూమిని పోలిన మరో గ్రహం...

భూమిని పోలిన మరో గ్రహం...

విశ్వంలో మన భూమిని పోలిన, అదే పరిమాణం కలిగిన గ్రహం ‘రోజ్‌ 128బీ'ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రశాంతమైన మరుగుజ్జు నక్షత్రం ‘రోజ్‌ 128' చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం భూమికి 11 కాంతి సంత్సరాల దూరంలో ఉంది. చీలిలోని లా సిల్లా అబ్జర్వేటరీలో యురోపియన్‌ సౌతర్న్‌ అబ్జర్వేటరీకి చెందిన ‘హై అక్యూరసీ రేడియల్‌ వెలాసిటీ ప్లానెట్‌ సెర్చర్‌' సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కనుగొన్నారు.

 చేరుకోవడానికే మన జీవితం చాలదు...

చేరుకోవడానికే మన జీవితం చాలదు...

మనం ఈ ‘రోజ్‌ 128బీ' గ్రహాన్ని చేరుకోవాలంటే దాదాపు 1,41,000 ఏళ్లు పడుతుందట. ఇది మినుకు మినుకు మంటూ కనబడటానికే 79 వేల ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. రోజ్‌ 128బీ భూమి కంటే కేవలం 1.38 రెట్లు ఎక్కువ వికిరణం కలిగి ఉందని, దశాబ్దం క్రితమే దీనిని కనుగొన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహంపై ఏలియన్లు జీవించే అవకాశం ఉందంటూ యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవా పరిశోధకులు తెలిపారు.

మన వాతావరణమే ఉంటుందా?

మన వాతావరణమే ఉంటుందా?

‘రోజ్‌ 128బీ' గ్రహంపై వాతావరణం మన భూమ్మీద ఉండే వాతావరణం మాదిరిగానే ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి వాతావరణం గురించి అంత కచ్చితంగా చెప్పలేంగానీ.. భూ వాతావరణమే ఉండే అవకాశం ఉందంటున్నారు. విశేషం ఏమిటంటే ఈ గ్రహంపై ఆక్సిజన్, నీరు కూడా ఉండొచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అంటుంటే.. ‘చెప్పలేం వీనస్ గ్రహంపై ఉన్నట్లుగా ఆ గ్రహం మొత్తం విషవాయువులతో నిండిపోయి ఉండొచ్చు కూడా..' అని మరికొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఉష్ణోగ్రత విషయానికొస్తే.. మైనస్ 76 నుంచి 68 డిగ్రీల ఫారెన్ హీట్ ఉండొచ్చంటున్నారు.

ఇక్కడి ఏడాది కాలం.. అక్కడ 9.9 రోజులే!

ఇక్కడి ఏడాది కాలం.. అక్కడ 9.9 రోజులే!

భూమ్మీద మనకు 365 రోజులు గడిస్తే ఒక ఏడాది గడిచినట్లు. అయితే కొత్త భూమి ‘రోజ్ 128బీ'పై మాత్రం ఏడాది అంటే.. కేవలం 9.9 రోజులే. ఈ లెక్కన మన భూమ్మీద యుక్తవయసు 21 ఏళ్లు అనుకుంటే.. ఆ గ్రహం మీద అప్పటికే దాదాపు 774 ఏళ్లు వచ్చేస్తాయి. ఈ ‘రోజ్ 128బీ'గ్రహం గోల్డీలాక్స్ ప్రాంతంలో ఉండి ఉంటుందా? అనేది ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తల ముందున్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ గోల్డీలాక్స్ ప్రాంతంలో ఉండే గ్రహాలపై కచ్చితంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నీటి ప్రవాహాలు ఉన్న గ్రహం మానవ ఆవాసానికి అత్యంత అనుకూలం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీని గురించి 2024 వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. ఎందుకంటే, ఈ గ్రహాన్ని మరింత దగ్గరినుంచి చూడగలిగే శక్తివంతమైన టెలిస్కోప్ అప్పటికి గాని రూపుదిద్దుకోదట.

 భవిష్యత్తులోనైనా మనం వెళ్లగలమా?

భవిష్యత్తులోనైనా మనం వెళ్లగలమా?

అచ్చం మన భూమి లాంటి గ్రహం విశ్వంలో కనిపించినప్పటికీ అక్కడికి మనం చేరుకోవడం అసాధ్యమే. ఎందుకంటే, ‘రోజ్ 128బీ' గ్రహం మనకు 11 కాంతి సంవత్సరాల దూరంలో ఉండడమే. ఉన్న ఆశ అల్లా ఏమిటంటే... ఈ గ్రహం మాతృతార అయిన రోజ్ 128 మెల్లమెల్లగా మన భూమి వైపు వస్తుండడమే. నిజానికి ఇప్పుడున్న దూరానికి మినుకుమినుకు మంటూ ఈ నక్షత్రం భూమ్మీదున్న మనకు కనిపించడానికే 79 వేల సంవత్సరాలు పడుతుంది. కాకపోతే, మన అదృష్టం బాగుండి అదేదో ‘స్టార్ ట్రెక్' సినిమా తరహాలో కాంతి సంవత్సరాల వేగంతో దూసుకుపోగలిగే స్పేస్ షిప్ లను మనం తయారుచేసుకోగలిగితే.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా విశ్వంలో అందనంత దూరాన ఉన్న ఈ ‘మరో భూమి'ని మనం చేరుకోగలమేమో!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+