కొండ చివరన ‘సెల్ఫీ’ దంపతుల ప్రాణం తీసింది

లండన్: తమ ‘సెల్ఫీ' తీసుకోవాలని ఓ కొండపైకి ఎక్కిన దంపతులు అక్కడ్నుంచి ప్రమాదవశాత్తు జారీ పడటంతో తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన పోర్చుగల్‌లో జరిగింది.

లిస్బన్ సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలమైన కోబో డి రోకా కొండపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎవరూ లేనటువంటి కొండపైకి ఆ దంపతులు చేరుకున్నారు. ఆ తర్వాత వారు కొండ చివర తమ సెల్ఫీని తీసుకునేందుకు ప్రయత్నించారు.

'Selfie' on cliff edge kills Polish couple

అయితే వారు సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రమాదశాత్తు వారు అక్కడి నుంచి జారిపడ్డారు. కొండ చాలా ఎత్తులో ఉండటంతో కిందపడిన ఆ దంపతులు తీవ్రగాయాలపాలై మృత్యువాతపడ్డారు.
ప్రమాద సమయంలో ఆ దంపతుల పిల్లలు ఒకరు ఐదేళ్లు, మరొకరు ఆరేళ్ల వయస్సున్న వారు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు.

పోలాండ్‌కు చెందిన ఈ దంపతులు గత కొన్నేళ్లుగా పోర్చుగల్‌లో ఉంటున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. సోమవారం ఆ దంపతుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి సెల్ఫీ కోసం తుపాకీతో ఫోజు పెట్టి ప్రమాదశాత్తు గన్ పేలడంతో మృత్యువాత పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+