ట్రంప్ బాదిన బాదుడుకు కొంప కొల్లేరు అయిందిగా

టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తోన్నందున భారత్ పై కొరడా ఝుళిపిస్తోన్నారు. క్రమంగా ఇది రెండు దేశాల మధ్య తీవ్ర అగాథాన్ని సృష్టిస్తోంది. దౌత్య సంబంధాలు దెబ్బతినేంత వరకూ వెళ్లిందీ పరిస్థితి.

రష్యాను డొనాల్డ్ ట్రంప్ బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

Several American retailers have reportedly halts Indian goods

తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా భారత్ పై 50 శాతం టారిఫ్ భారం పడింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.

తాజాగా భారత్ తో ట్రేడింగ్ చర్చలపై మరోసారి తన వైఖరిని బయటపెట్టారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ అంశంపై భారత్ తో గానీ.. ఆ దేశ ప్రతినిధులతో గానీ చర్చించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించుకునేంత వరకూ భారత్ తో ఎటువంటి ట్రేడ్ నెగోషియేష్స్ కూడా ఉండబోవని స్పష్టం చేశారు.

ఈ టారిఫ్ ఇప్పటికే అమలులోకి వచ్చింది. దీని తరువాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి. అమెరికాలో భారత రిటైల్ మార్కెట్ ప్రమాదంలో పడింది. భారత్ నుంచి వివిధ రకాల వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని అక్కడి రిటైల్ జెయింట్ సంస్థలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

దీనిపై ఎన్డీటీవీ ప్రాఫిట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారత్ నుండి వస్త్రాలు- దాని అనుబంధ వస్తువులు రవాణాను వెంటనే నిలిపి వేయాలని అమెరికా కొనుగోలుదారులు భారతీయ ఎగుమతిదారులను కోరుతున్నట్లు తెలిపింది. అమెరికాలోని వాల్‌మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి ప్రధాన రిటైలర్లు తమ ఆర్డర్లను నిలిపివేశాయని పేర్కొంది.

డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించాలన్న నిర్ణయం దీనికి కారణం. పెరిగిన వ్యయ భారాన్ని స్వీకరించడానికి ఆయా అమెరికన్ రిటైలర్లు సుముఖంగా లేరు. దీనికి బదులుగా పెరిగిన ఈ ఆర్థిక భారాన్ని భారతీయ ఎగుమతిదారులే భరించాలని ఒత్తిడి చేస్తున్నారని ఎన్‌డిటివి ప్రాఫిట్ తెలిపింది.

ఇది దేశీయ టెక్స్ టైల్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్త టారిఫ్ విధానం వల్ల ఖర్చులు 30 నుంచి 35 శాతం పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా- అమెరికాకు వెళ్లే ఆర్డర్లలో 40 నుంచి 50 శాతం తగ్గుదల ఉంటుందని, నాలుగు నుంచి అయిదు బిలియన్ డాలర్ల నష్టాలకు దారి తీయవచ్చని చెబుతున్నారు.

వెల్ స్పన్ లివింగ్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో కౌంట్, ట్రైడెంట్ వంటి ప్రముఖ ఎగుమతిదారులు తమ అమ్మకాల్లో 40 నుండి 70 శాతం వరకు అమెరికా మార్కెట్ నుండి ఆర్డర్లను పొందుతున్నారు. ఆయా సంస్థలు నష్టాలను చవి చూడాల్సి రావచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉండగా- బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ దాదాపు 20 శాతంగా ఉన్నాయి. దీంతో అమెరికన్ రిటైల్ మార్కెట్ మొత్తం కూడా అటు తరలిపోతుందనే ఆందోళన దేశీయ టెక్స్ టైల్ రంగంలో నెలకొంది.

ఈ ఏడాది మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి టెక్స్ టైల్- దాని ఆధారిత పరిశ్రమ ఎగుమతుల్లో అమెరికా అతిపెద్ద మార్కెట్‌. ఈ ఎగుమతుల విలువ 36.61 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో 28 శాతం అమెరికా వాటా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 శాతం టారిఫ్ వల్ల అమెరికన్ రిటైలర్లు భారత దిగుమతులను వదులుకోవడం ప్రభావం చూపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+